మహేష్ 25 వ సినిమాకి లొకేషన్ వేటలో డైరక్టర్
- July 4, 2017 / 07:07 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ముగ్గురు దర్శకులతో పనిచేస్తున్నారు. తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చేస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో మిగిలిఉన్న రెండు పాటల్లో ఒక దానిని రేపటి నుంచి షూట్ చేయనున్నారు. ఈరోజు వరకు మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. కొరటాల పేకప్ చెప్పగానే.. మురుగదాస్ ముందు ప్రత్యక్షం కానున్నారు. వీరిద్దరి తో పాటు వీలు చిక్కినప్పుడల్లా తన 25 వ సినిమా పనులను పర్వవేక్షిస్తున్నారు. వంశీ పైడిపల్లి తో చేయనున్న ప్రాజక్ట్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. తాజాగా ఈ డైరక్టర్ అమెరికాకి వెళ్లనున్నట్లు తెలిసింది.
ఈ మూవీ ఎక్కువగా అమెరికా నేపథ్యంలో సాగుతుంది. అందుకే అక్కడ అందమైన లొకేషన్స్ ని వెతకడానికి రైటింగ్ టీమ్ తో కలిసి వంశీ బయలుదేరనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మించన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక రోల్ పోషిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












