తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్-సావిత్రిల కాంబినేషన్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే.. అసలు వీరిద్దరూ కలిసి నటిస్తే చాలు హిట్టు కొట్టినట్టే.. అనే టాక్ వినిపించేది. సినిమాలు కూడా అలానే హిట్టయ్యాయి. అయితే.. సావిత్రి తర్వాత.. ఎన్టీఆర్ సరసన ఆ రేంజ్‌లో నటించే నాయకలు రాలేదని అప్పట్లో వార్త వినిపించేవి. జయప్రద, జయసుధ, శ్రీదేవిలకన్నా ముందు.. ఎన్టీఆర్‌తో నటించిన అంజలీదేవి, కాంచన వంటివారు కొద్దిగా పేరు తెచ్చినా.. సావిత్రి-ఎన్టీఆర్ కాంబినేషన్లను మాత్రం మరిపించలేక పోయారు.
ఈ క్రమంలో కొందరు దర్శకులకు వాణిశ్రీ-ఎన్టీఆర్ కాంబినేషన్‌పై గురి కుదిరింది. కానీ, ఇద్దరి కాల్షీట్లు బిజీ. అప్పటికే వాణి శ్రీ – అక్కినేని జంటకు ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనే టాక్ ఉండడం.. అనేక సినిమాలు హిట్ అవడంతో వాణిశ్రీ మార్కెట్ దూకుడుగా ఉండేది. అయినప్పటికీ.. ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ అయితే బెటర్ అనే ఆలోచనతో అప్పటి దర్శకులు ప్రయత్నాలు చేశారు.
అలా.. చిట్టి చెల్లెలు సినిమా తొలిసారి తెరమీదికి ఎక్కింది. ఈ పెయిర్‌కు కూడా మంచి టాక్ వచ్చింది. అనంతరం.. వరుస పెట్టి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. జీవిత చక్రం, ఆరాధన, అగ్గిబరాటా, రాముని మించిన రాముడు, మాయామశ్చీంద్ర, రైతు బిడ్డ వంటి సినిమాలు వరుసగా చేశారు. వీటిలో ఆరాధన సూపర్ డూపర్ హిట్టయింది. ఒకరకంగా.. దర్శకులకు, అటు నిర్మాతలకు కూడా.. ఎన్టీఆర్-వాణిశ్రీ కాంబినేషన్ సిరులు కురిపించింది.
కానీ, సావిత్రి పేరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో తొలిగిపోలేదు. దీంతో సావిత్రిని మరిపించడం.. అంత సాధ్యం కాదని తేల్చేశారు. ఇదే విషయాన్ని కళాభినేత్రి వాణిశ్రీ ఓ సందర్భంలో చెబుతూ..సావిత్రి లాగా నన్ను చూడాలని అనుకున్నారు. కానీ, సాధ్యం కాలేదు. ఎవరి నటన వారిదే అని (Vanisree) వాణీ శ్రీ చెప్పుకొచ్చారు.