Vanitha Vijay Kumar: మాజీ భర్తపై వనిత విజయ్ కుమార్ ఎమోషనల్ పోస్ట్!

తమిళ స్టార్ నటుడు విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. నెగిటివ్ రోల్స్ చేసినా పాజిటివ్ రోల్స్ చేసినా.. ఆ పాత్రలకు జీవం పోసేవారు విజయ్ కుమార్. ఇక అతని కుమార్తె వనిత విజయ్ కుమార్ కూడా అందరికీ సుపరిచితమే. ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు తర్వాత ఈమె మూడు పెళ్లిళ్లు చేసుకుని హాట్ టాపిక్ గా నిలిచింది.

2020 లో ఎక్కువ హాట్ టాపిక్ గా నిలిచింది ఈమె మూడు పెళ్లిళ్ల వ్యవహారమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెళ్ళైన కొన్నాళ్లకే తన మూడో భర్త పీటర్ పాల్ తో మనస్పర్థలు వచ్చాయి. అతనికి తాగుడు అలవాటు ఉండటంతో చిత్ర హింసలు పెడుతున్నాడు అంటూ ఆమె ఆరోపణలు చేసింది. తర్వాత అతను హాస్పిటల్ పాలవ్వడం, శనివారం నాడు అతను మరణించడం జరిగింది. ఈ క్రమంలో వనిత విజయ్ కుమార్ తన మూడో భర్తను తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

(Vanitha Vijay Kumar) వనిత విజయ్ కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ.. “ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడేందుకు తమకు తాముగా ప్రయత్నించేవారికి దేవుడు సాయం చేస్తాడని మా అమ్మ చెప్పింది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా తమ సొంత మార్గాన్ని వెతుక్కుంటారు.

మీరు అనుభవించిన గాయంతో పోరాడిన తర్వాత ఇప్పుడు శాంతిని పొందారని నేను భావిస్తున్నాను. మీరు ఈ లోకం నుండి వెళ్లిపోవడం నన్నెంతో బాధించింది. చివరకు మీకు శాంతిని ప్రసాదించే చోటుకు వెళ్లిపోయారు. ఎక్కడున్నా సంతోషంగా ఉండండి” అంటూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus