Vanitha Vijaykumar, NTR: ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ అంటున్న వనిత!

ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వనితా విజయ్ కుమార్ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో దేవి సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వనితా విజయ్ కుమార్ ఆ తర్వాత తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. తాజాగా అలీతో సరదాగా షో ప్రోమో రిలీజ్ కాగా వనితా విజయ్ కుమార్ ఈ షోకు గెస్ట్ గా హాజరు కావడంతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నాగలక్ష్మీ మహేశ్వరి వనిత ఈమె అసలు పేరు కాగా వనితా విజయ్ కుమార్ గా ఈ నటి పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రముఖ నటి మంజుల కూతురైన వనిత బుర్ర సరిగ్గా లేదని అందుకే దేవి సినిమా తర్వాత తెలుగులో ఎక్కువగా నటించలేదని సరదాగా చెప్పుకొచ్చారు. తెలుగులో ఆఫర్లు వచ్చినా చేయలేదని అయితే తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తానని ఇక్కడి దర్శకనిర్మాతలకు తెలుసని వనితా విజయ్ కుమార్ అన్నారు. చిన్నప్పుడు తాను నాగార్జునకు ఫ్యాన్ అని జూనియర్ ఎన్టీఆర్ కు తాను బిగ్గెస్ట్ ఫ్యాన్ అని వనిత తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క షాట్ అయినా యాక్ట్ చేయాలనే పెద్ద డ్రీమ్ తనకు ఉందని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. దేవి సినిమాలో నిజమైన పాము తను ముఖంపై పాము కుంకుమ పెట్టిందని వనితా విజయ్ కుమార్ వెల్లడించారు. ఫాదర్, సిస్టర్స్ తాను కష్టపడిన సమయంలో ఉన్నారని తనకు అన్నీ పాజిటివ్ గా జరుగుతున్న సమయంలో మాత్రం ఎవరూ లేరని వనిత కామెంట్లు చేశారు.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus