Vanitha Vijay Kumar: వనితా విజయ్ కుమార్ ఇంట విషాదం.. ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వివాదాస్పద నటిగా, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరును సొంతం చేసుకున్న వనితా విజయ్ కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. వనితా విజయ్ కుమార్ మేనకోడలు అనిత హార్ట్ ఎటాక్ తో చనిపోగా వనితా విజయ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. వనితా విజయ్ కుమార్ తన పోస్ట్ లో ఈరోజు ఉదయం విషాదకర వార్తతో నిద్ర లేచానని చెప్పుకొచ్చారు.

20 సంవత్సరాల వయస్సు ఉన్న తన మేనకోడలు అనిత న్యూఢిల్లీలో సర్జరీ జరిగిన తర్వాత మరణించిందని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. అనిత తనకు దేవుడిచ్చిన కూతురులాంటిదని మా నాన్న సోదరుడి కూతురు పేరు ఇంద్ర అని ఆమె కూతురు అనిత అని వనితా విజయ్ కుమార్ తెలిపారు. మా ఫ్యామిలీలో అందరికీ ఇంద్ర అక్క అంటే ఇష్టమని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. అనితకు దయాగుణం ఎక్కువని ఎప్పుడూ తనకు మద్దతుగా నిలబడటంతో పాటు అన్ని విషయాలను అనిత బాగా అర్థం చేసుకునేదని వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

అనిత తనను, తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చిందని కానీ అంతలోనే ఈ విధంగా జరిగిందని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. నా హృదయం ముక్కలైందని మాటలు రావడం లేదని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా స్వీట్ హార్ట్ అంటూ అనిత గురించి వనితా విజయ్ కుమార్ పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus