హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన కామెంట్స్…!

వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే…. మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా …మరికొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటిస్తూ సంపూర్ణ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది.ఆమె ఎంచుకున్న ఏ పాత్రకైనా వందకు వంద శాతం న్యాయం చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈమె తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది. గతేడాది సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ చిత్రంలో నటించింది.

ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ… ఆమె పై కౌంటర్లు వేసే వాళ్ళకు దిమ్మతిరిగే రిప్లై స్ ఇస్తూ ఉంటుంది. అంతేకాదు సామాజిక అంశాల పై కూడా స్పందిస్తూ ఉంటుంది.

‘ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా… పురుషులు ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇందులో కొంతమంది వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు కానీ చాలా మంది ఖాళీగా ఉంటున్నారు కూడా. వీరి వల్ల మహిళలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి అని విన్నాను. అలా వేధింపులకు గురయ్యే మహిళలు 1800 102 7282 నెంబర్ కు కాల్ చెయ్యండి’.. అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. దాంతో ఈమె పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus