Varalaxmi Sarathkumar: రివ్యూలపై ఫైర్ అయిన వరలక్ష్మి.. అన్ని రోజులు ఆపేయాలంటూ?
- April 24, 2024 / 08:33 PM ISTByFilmy Focus
టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నటించిన శబరి మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ రివ్యూల విషయంలో ఫైర్ అయ్యారు. ఏం అర్హత ఉందని మీరు రివ్యూలు రాస్తున్నారు అంటూ రివ్యూవర్ల గురించి కామెంట్ చేశారు. నేను అసలు సినిమా రివ్యూలు చదవనని ఒకవేళ ఎవరైనా నా దగ్గర సినిమా రివ్యూల గురించి మాట్లాడినా కోపం వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఏ అర్హతతో సినిమా రివ్యూలు రాస్తున్నారని బాగున్న సినిమాకు సైతం వ్యూస్ కోసం నెగిటివ్ రివ్యూలు రాస్తున్నారని వరలక్ష్మి వెల్లడించారు. గతంలో ఈ విధంగా ఉండేది కాదని సినిమా విడుదలైన ఐదు రోజుల వరకు రివ్యూలను ఆపితే బాగుంటుందని వరలక్ష్మి పేర్కొన్నారు. అయితే వరలక్ష్మి కౌంటర్లకు రివ్యూవర్లు సైతం తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. హనుమాన్ సినిమా రివ్యూల వల్లే 330 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని ఈ సందర్భంగా చెబుతున్నారు.

రివ్యూల వల్లే హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా రివ్యూవర్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తే ఏ వెబ్ సైట్ ఎన్ని స్టార్స్ ఇచ్చిందో ప్రచురిస్తున్న మేకర్స్ కూడా ఉన్నారని రివ్యూవర్లు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రివ్యూలను ఆపినా పెద్దగా బెనిఫిట్ ఉండదని సోషల్ మీడియా ద్వారా సులువుగానే టాక్ స్ప్రెడ్ అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.

మదర్ సెంటిమెంట్ తో శబరి మూవీ తెరకెక్కుతుండగా మే నెల 3వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో లేదో చూడాలి. కొన్ని సినిమాలకు రివ్యూలను ఆపితే నష్టం కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
















