సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా కమల్ హాసన్ (Kamal Haasan) కుటుంబంలో కూడా విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమల్ హాసన్ మామగారు పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు అయిన శ్రీనివాసన్ మరణించారు. సోమవారం నాడు కొడైకెనాల్‌లో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. పరమకుడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్.. గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో కూడా పనిచేయడం జరిగింది. ఆయన వయసు 92 ఏళ్లు అని సమాచారం.
శ్రీనివాసన్ భౌతికకాయాన్ని దహన సంస్కారాల కోసం చెన్నైకి తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యులు. మరోపక్క అంత్యక్రియలు ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో నిర్వహించినట్లు సమాచారం. మంగళవారం నాడు శ్రీనివాసన్ అంత్యక్రియలు జరిగాయి ఈ క్రమంలో శ్రీనివాసన్ మృతికి చింతిస్తూ కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక శ్రీనివాస్ మృతిపై కమల్ హాసన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..
“నా వ్యక్తిత్వ వికాసంలో మావయ్య ఆరుయిర్ శ్రీనివాసన్ పాత్ర ఎంతో కీలకమైనది. ఆయన ఆలోచనలు నిజంగా విప్లవాత్మకంగా ఉంటాయి. ఆయన చాలా డేరింగ్ పర్సన్. సోమవారం నాడు వాసు మామ మృతి చెందడం.. మమ్మల్ని విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. అంత్యక్రియల కోసం మామ భౌతికకాయాన్ని సోమవారం నాడు రాత్రి ప్రజా నీతి కేంద్రం కార్యాలయానికి తీసుకొచ్చాము. మంగళవారం నాడు.. బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు చేశాము’’ అంటూ పేర్కొన్నారు.
எனது ஆளுமை உருவாக்கத்தில் பெரும்பங்கு வகித்த ஆருயிர் மாமா சீனிவாசன் இன்று தன்னுடைய 92-வது வயதில் கொடைக்கானலில் காலமானார். புரட்சிகரமான சிந்தனைகளுக்காகவும், துணிச்சலான செயல்களுக்காகவும் உறவினர்கள் நண்பர்கள் மத்தியில் ஒரு வீரயுக நாயகனாக திகழ்ந்தவர் வாசு மாமா.