Varalaxmi Sarathkumar: నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!
- March 2, 2024 / 06:34 PM ISTByFilmy Focus
కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ మంచి పేరును సంపాదించుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర చనిపోతే కూడా ఆ సినిమా హిట్ అని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. అయితే ఫ్యాన్స్ కు వరలక్ష్మి శరత్ కుమార్ పరోక్షంగా అదిరిపోయే శుభవార్త చెప్పారు.
వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగిందని ఆమెకు కాబోయే భర్త పేరు నికోలాయ్ సచ్ దేవ్ అని తెలుస్తోంది. నికోలాయ్ సచ్ దేవ్ గ్యాలరిస్ట్ అని సమాచారం. నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ నిశ్ఛితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వరలక్ష్మి, నికోచాయ్ లకు గత 14 సంవత్సరాలుగా పరిచయం ఉందని ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుందని సమాచారం అందుతోంది. వరలక్ష్మి నికోలాయ్ జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

నికోలాయ్ సచ్ దేవ్ కు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. వరలక్ష్మి నికోలాయ్ జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు. వరుస విజయాలతో వరలక్ష్మి అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. 38 సంవత్సరాల వయస్సులో వరలక్ష్మి పెళ్లిపీటలెక్కనున్నారు.
ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న రాయన్ సినిమాలో (Varalaxmi Sarathkumar) ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలో వరలక్ష్మి తన పెళ్లికి సంబంధించి అధికారికంగా మరిన్ని విషయాలను వెల్లడించనున్నారు. వరలక్ష్మి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో వరలక్ష్మి పెళ్లికి సంబంధించి పలు వార్తలు వైరల్ అయినా ఆ వార్తలను ఆమె ఖండించారు.




ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!














