Varalaxmi Sarathkumar: అతడిపై కేసు పెట్టాను.. నటి వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్ వైరల్.!
- May 1, 2024 / 03:27 PM ISTByFilmy Focus
సీనియర్ హీరో శరత్ కుమార్ (R. Sarathkumar) కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ (Varalaxmi Sarathkumar) .. మరో రెండు రోజుల్లో ‘శబరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. వరలక్ష్మీ మాట్లాడుతూ.. “అమ్మాయిలు ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఈజీ కాదు.మా నాన్న గారికి నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేడు.
అయినా నా ఇష్టాన్ని ఆయన కాదనలేదు. నటిగా అప్పుడప్పుడే బిజీ అవుతున్న రోజుల్లో ఓ టీవీ ఛానల్ అధినేత మా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించినట్లు ఆయన అడిగాడు. దానికి నేను ఓకే అన్నాను. కానీ తర్వాత ‘మనం మళ్ళీ కలుద్దాం. బయట కలుద్దామా.. రూమ్ బుక్ చేస్తాను.. మాట్లాడుకుందాం’ అని అన్నాడు. అతని దురుద్దేశం గ్రహించి అతడిపై కేసు పెట్టాను.6 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన అది.

స్టార్ హీరో కూతురు అయినంత మాత్రాన నాకు అవకాశాలు వస్తున్నాయి అనేది నిజం కాదు.నన్ను కూడా చాలా మంది కమిట్మెంట్ అడిగారు. దాని వల్ల చాలా ఆఫర్స్ పోగొట్టుకున్నాను. స్టార్ హీరో కూతుర్నైన నాకే ఇలా ఉంటే సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటి అని భావించి ‘సేవ్ శక్తి ఫౌండేషన్’ ని స్థాపించాను. శక్తిగా పిలవబడే మహిళలను కాపాడటమే ఈ ఫౌండేషన్ యొక్క లక్ష్యం” అంటూ చెప్పుకొచ్చింది.
















