Varasudu: వారసుడు డేట్ ఫిక్స్.. వీరయ్య, వీరసింహా తేలుస్తారా?

సంక్రాంతి పండుగ కానుకగా మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా వారసుడు మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.  2023 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. యూకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ్ అహింసా ఎంటర్టైన్మెంట్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం గమనార్హం. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. వారసుడు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన నేపథ్యంలో

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి కూడా త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన రిలీజ్ కానుందని వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన రిలీజ్ కానుందని బోగట్టా. ఈ మూడు సినిమాలకు దాదాపుగా సమాన స్థాయిలో థియేటర్లను కేటాయిస్తున్నారని సమాచారం. థమన్ వారసుడు సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమా నుంచి రిలీజైన రంజితమే సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై కూడా బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో అని ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది.

సంక్రాంతి సీజన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి బెస్ట్ సీజన్లలో ఒకటనే సంగతి తెలిసిందే. . ఈ మూడు సినిమాలకు 500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరగడం హాట్ టాపిక్ అవుతోంది. సంక్రాంతి సినిమాల కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus