మహానటుడు నందమూరి తారక రామారావు అశీసులతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తారక్.. తెలుగు ప్రజల మనసు దోచుకున్నారు. ప్రతి సినిమాలో అవలీలగా నవరసాలు పలికించి తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నారు. అయితే కొన్ని చిత్రాల్లో అతని నటన పీక్స్ లో ఉంటుంది. ఒక్కో ఎక్స్ ప్రెషన్ కి ఒక్కో చిత్రంలో హైలెట్ అవుతుంది. యంగ్ టైగర్ నవరసాల సినిమాలపై ఫోకస్..
వీరం నూనూగు మీసాల సమయంలోనే ఎన్టీఆర్ వీరత్వం పలికించారు. “ఆది” సినిమాలో వీరం అనే ఎక్స్ ప్రెషన్ ని తారక్ చూపించిన విధానం అందరిని అభిమానులను చేసింది.
శృంగారం ఎన్టీఆర్ కి శృంగారం అంటే సిగ్గు ఎక్కువ అందుకే వెండితెరపైన చాలా తక్కువగా చూపించినా… సింహాద్రి,
రాఖీ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో బాగానే రొమాన్స్ చేశారు.
కరుణ ఇతరుల పట్ల కరుణ చూపించడమే సన్నివేశాలు ఎన్టీఆర్ సినిమాల్లో అనేకం ఉన్నాయి. కానీ నాన్న కోరికను తీర్చాలని, ఆఖరి కోరిక తీరకుండా తండ్రి ఎక్కడ చనిపోతాడోనని నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ కరుణ రసాన్ని చక్కగా పలికించారు.
అద్భుతం యమదొంగ సినిమాలో యువ యముడి పాత్రలో ఎన్టీఆర్ డైలాగులతో అదరగొట్టాడు. అందరితో అద్భుతహా అని అనిపించుకున్నారు.
హాస్యం ఎప్పుడూ ఆవేశంతో కూడిన పాత్రల్లో యాక్షన్ చూపించే ఎన్టీఆర్, అదుర్స్ సినిమాలో చారి పాత్రలో నవ్వులు పూయించారు.
భయానకం ఎన్టీఆర్ ఇమేజ్ ని అమాంతం పెంచిన సినిమా సింహాద్రి. ఇందులో కొన్ని ఫైట్స్ సీన్స్ లో ఎన్టీఆర్ భయానక రసంతో మెప్పించారు.
రౌద్రం ఎన్టీఆర్ డిఫెరెంట్ గా చేసిన సినిమా టెంపర్. ఇందులో తారక్ రౌద్రం తో ఆకట్టుకున్నారు.
శాంతం ఎన్టీఆర్ చేసిన కుటుంబ కథ చిత్రం బృందావనం. ఇందులో ఫైట్స్ ఉన్నప్పటికీ ఎక్కువభాగం చాలా కూల్ గా అలరించారు.
బీభత్సం ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా జై లవకుశ. మూడు క్యారెక్టర్లో నవరసాలతో ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా జై పాత్ర వెండితెరపై బీభత్సం సృష్టించడం ఖాయం.
ఎన్టీఆర్ సినిమాలను ఒక ఎక్స్ ప్రెషన్ కే పరిమితం చేయడం చాలా కష్టమైన విషయం. కానీ ఆ ఎక్స్ ప్రెషన్ పేరు చెబితే మాకు గుర్తుకు వచ్చిన సినిమా గురించి రాశాము. మీకు ఏ సినిమా గుర్తుకు వస్తుందో కామెంట్ చేయండి.