Varsha Bollamma: ఆ స్టార్ అంటే ఇష్టమంటున్న వర్ష బొల్లమ్మ!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. చూసీ చూడంగానే అనే సినిమాతో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. తమిళ, మలయాళ సినిమాలతో పాపులర్ అయిన వర్ష బొల్లమ్మకు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో సక్సెస్ దక్కింది. ఆనంద్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ నటించడం గమనార్హం.

ఆ తర్వాత వర్ష బొల్లమ్మ పుష్పక విమానం, స్టాండ్ అప్ రాహుల్ సినిమాలలో నటించగా ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. హీరోల తమ్ముళ్ల పక్కన వర్ష బొల్లమ్మ ఎక్కువగా నటిస్తుండగా అలా చేయడం గురించి ఆమె స్పందిస్తూ నేను కావాలని ఈ సినిమాలను ఎంపిక చేసుకోలేదని తెలిపారు. అలా కుదురుతోందని ఆమె చెప్పుకొచ్చారు. వైవిధ్యమైన సబ్జెక్ట్స్ తో వస్తున్న దర్శకులు నన్ను ఎంపిక చేసుకుంటున్నారని వర్ష బొల్లమ్మ కామెంట్లు చేశారు.

నెగిటివ్ షేడ్స్ ఉన్న సైకో పాత్రలో నటించాలని నాకు ఉందని ఆమె చెప్పుకొచ్చారు. నేను అలాంటి పాత్రలో నటిస్తానా అనుకునే పాత్రలో నటించాలని నాకు ఉందని వర్ష బొల్లమ్మ కామెంట్లు చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోని ఆఫర్లతో వర్ష బొల్లమ్మ బిజీగా ఉండటం గమనార్హం. నెంబర్ గేమ్ ను తాను పెద్దగా పట్టించుకోనని వర్ష బొల్లమ్మ కామెంట్లు చేశారు.

తాను కమర్షియల్ సినిమాలు కూడా చేస్తానని నటిగా నేను మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. తన ఫేవరెట్ హీరో గురించి వర్ష బొల్లమ్మ స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో అని ఆమె తెలిపారు. కొమురం భీముడో సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటన నాకు ఎంతగానో నచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కు నేను అభిమానినని ఆమె చెప్పుకొచ్చారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus