Jr NTR,Varsha Bollamma: ఎన్టీఆర్ పై స్వాతి ముత్యం హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వర్ష బొల్లమ హీరోయిన్ గా స్వాతి ముత్యం మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు లక్ష్మణ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్.. చిత్రాలతో పాటు అక్టోబర్ 5 నే ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ఈ మూవీ ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

రెండు పెద్ద చిత్రాల మధ్య ఈ చిన్న సినిమా రిలీజ్ అవుతుంది అంటే కచ్చితంగా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అని అంతా అనుకుంటారు. ప్రోమోస్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ వర్ష బొల్లమ పాల్గొని ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ‘ మీకు ఇష్టమైన హీరో ఎవ్వరైనా ఉన్నారా? ‘ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా… ‘ నాకు ఇష్టమైన హీరో అంటూ ఎవ్వరూ లేరు.

ఇది చాలా సేఫ్ ఆన్సర్. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో కొమరం భీముడో పాట చూసినప్పుడు ఎన్టీఆర్ నటన చాలా బాగా నచ్చింది. ఆ పాటలో కోపంతో, బాధతో ఎన్టీఆర్ బుగ్గలు ఊపించినప్పుడు గూజ్ బంప్స్ వచ్చాయి. ‘ అంటూ చెప్పుకొచ్చింది వర్ష. ఇక స్వాతి ముత్యం సినిమాలో తన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చింది. కమర్షియల్ సక్సెస్ అందినా అందకపోయినా మంచి పెర్ఫార్మర్ అనిపించుకోవడం ఇష్టం అని కూడా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!


నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus