Varun Sandesh: రంగు రంగుల జుట్టుతో ప్రచారం అందుకే.. వరుణ్‌ సందేశ్‌ క్లారిటీ

విజయాలు లేకున్నా.. వరుస అవకాశాలు.. సినిమాలు చేస్తున్న టాలీవుడ్‌ హీరోల్లో వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) ఒకరు. ఎందుకు ఛాన్స్‌లు వస్తున్నాయి అనే ప్రశ్నకు ఆన్సర్‌ దొరకడం కష్టం కానీ.. ఆయన నటిస్తున్న కొత్త సినిమా గురించి ఇటీవల ఆయన చెప్పిన కొత్త విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి కూడా. వరుణ్‌ హీరోగా నటించిన కొత్త సినిమా ‘విరాజి’ సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో యాండీ అనే డిఫరెంట్‌ రోల్‌లో నటించాడు వరుణ్‌ సందేశ్‌.

యాండీ పాత్ర కోసం వరుణ్‌ సందేశ్‌ లుక్‌ కొత్తగా ఉంది అని చాలామంది అంటున్నారు కూడా. దానికి కారణం ఆయన జుట్టుకు వేసుకున్న రుంగు. జుట్టుకు రెండు రంగులు వేసుకుని ఆ పాత్రలో కనిపిస్తాడు. ఇక్కడో విషయం ఏంటంటే.. ఇప్పుడు ప్రచారం కోసం కూడా వరుణ్‌ సందేశ్‌ అలానే తిరుగుతున్నాడు. దీని గురించి వరుణ్‌ సందేశ్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ఆ లుక్‌ విషయంలో వస్తున్న ట్రోల్స్‌ గురించి కూడా మాట్లాడాడు.

ఈ సినిమా చూసి ప్రేక్షకులు తనకు ఇంకో ఛాన్స్‌ ఇస్తారనే ఉద్దేశంతోనే ఆ సినిమాలోని యాండీ గెటప్‌లోనే ప్రచారం చేస్తున్నానని చెప్పాడు వరుణ్‌ సందేశ్‌. ఈ లుక్‌పై వచ్చిన ట్రోల్స్‌ గురించి నా భార్య వితిక (Vithika Sheru) చెప్పింది. ఆ విషయంలో ఆమె చాలా బాధపడింది. కానీ ఆ విమర్శలను నేను పట్టించుకోను. నేను ఏం చేసినా సినిమా కోసమే కదా. కథ చెప్పేటప్పుడే దర్శకుడు హీరో హెయిర్‌ ఓ వైపు బ్లూ కలర్‌, మరోవైపు ఎల్లో కలర్‌లో ఉంటుందని తెలిపారు.

కథలోని కీలకమైన ఆ ఆలోచన సందేశాత్మకంగా, ఆసక్తిగా అనిపించడంతో ఓకే చెప్పాను అని చెప్పాడు వరుణ్‌. గతంలో తాను పోషించిన చందు, బాలు లాంటి పాత్రల్లానే యాండీ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంని, ఎప్పటికీ గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను అని చెప్పాడు వరుణ్‌. ‘విరాజి’ సినిమాలో ప్రమోదిని (Pramodini) , రఘు కారుమంచి (Raghu Karumanchi) కీలక పాత్రధారులు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus