Varun Sandesh: హ్యాపీడేస్ సీక్వెల్ చేద్దామని అనుకున్నాం: వరుణ్

హ్యాపీ డెస్ సినిమాతో పరిచయమైన నటీనటులలో కొంతమంది ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ద్వారా పరిచయమైన ముఖ్యమైన నటుడు వరుణ్ సందేశ్ మాత్రం ఆ స్థాయిని కొనసాగించలేకపోయాడు. రెండవ సినిమా కొత్త బంగారు లోకం కూడా హిట్ అయిన తర్వాత వరుణ్ సందేశ్ రెండు మూడేళ్లలో చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఏ సినిమా కూడా అతనికి సరైన హిట్ ఇవ్వలేకపోయింది.

మధ్యలో చాలా ప్రయోగాలు చేశాడు కానీ ఏదీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ మధ్యలో ఏమైంది ఈ వేళ అనే ఒక రొమాంటిక్ సినిమాతో కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా మళ్లీ వరుస పరాజయాలతో సతమతమవ్వాల్సి వచ్చింది. రీసెంట్ గా ఇందువదన సినిమాతో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సీక్వెల్ పై కూడా తన వివరణ ఇచ్చాడు.

హ్యాపీడేస్ భారీ విజయాన్ని అందుకున్న తర్వాత శేఖర్ కమ్ముల గారు పార్ట్ 2 కూడా చేద్దామని నాతో అన్నారు. ఈ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా అందుకు ఎంతగానో సంతోషించారు. తప్పకుండా ఉంటుందని కూడా అనుకున్నాను. కానీ ఆయన లీడర్ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. నేను కూడా మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లి హ్యాపీ డేస్ 2 గురించి అడిగింది లేదు. అలా ఆ విధంగా చర్చలోకి పెద్దగా రాకుండానే సీక్వెల్ మాయమైనట్లు వరుణ్ వివరణ ఇచ్చాడు.

ఇక శేఖర్ కమ్ముల దగ్గర వర్క్ చేయడం అనేది ఒక మంచి ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన సినిమాల్లో అవకాశం దొరకడం చాలా కష్టం. ఆడిషన్స్ లో చాలా మందిని దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అని కూడా వరుణ్ ఇచ్చాడు. ఇక అదృష్టవశాత్తు మొదట్లోనే అలాంటి దర్శకుడితో పని చేసినందుకు మంచి అనుభవం ఏర్పడింది అని వరుణ్ సందేశ్ తెలియజేశాడు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus