Varun Sandesh: బిగ్ బాస్ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాము!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకుంది. ఇకపోతే గతంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు ఈ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి వారిలో నటుడు వరుణ్ సందేశ్ వితిక జంట ఒకటి.

వీరిద్దరు సెలబ్రిటీ కపుల్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వీరు తమ స్టైల్ లోనే ప్రేక్షకులను వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సందడి చేశారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ గురించి సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు విని చాలా ఇబ్బంది పడ్డాము అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వరుణ్ సందేశ్ వెల్లడించారు.

ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ తాము బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన తరువాత మాకు పెద్దగా లాభం కలిగింది ఏమాత్రం లేదని పైగా ఈ కార్యక్రమం వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డాము అంటూ చెప్పుకొచ్చారు. అది ఒక షో కేవలం ఒక గంట సేపు మాత్రమే ప్రసారం చేస్తారు అయితే ఈ గంట వ్యవధిలోనే మమ్మల్ని చూసి మా పట్ల ఒక నిర్ణయానికి రావడం సరైనది కాదని ఈయన తెలిపారు. ముఖ్యంగా రితిక విషయంలో నేటిజన్స్ దారుణమైనటువంటి బూతులతో ఆమెను ట్రోల్ చేశారని అసలు ఆ మాటలు చెప్పుకోవడానికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము అయితే వితిక చాలా స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఎదుర్కొని త్వరగా ఈ బాధ నుంచి బయటపడగలిగింది అంటూ వరుణ్ సందేశ్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం వితికా కెరియర్ పరంగా యూట్యూబర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక వరుణ్ సందేశ్ (Varun Sandesh) కూడా తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus