Varun Tej: బాబాయ్ వల్లే మాకు ఇండస్ట్రీ లో కసి పెంచింది!

తన గత చిత్రం ‘గని’ పరాజయంపై తొలిసారి మీడియాతో మాట్లాడారు నటుడు వరుణ్‌ తేజ్‌ . ఆ సినిమా ఫ్లాప్‌కు కారణమేమిటో తమకు తెలుసన్నారు. ‘‘గని’ నా ఫస్ట్‌ ఫ్లాప్‌ కాదు. దానికి ముందు కూడా కొన్ని ఫ్లాప్‌లు ఉన్నాయి. సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్‌ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతుంటా. ‘మిస్టర్‌’ ఫ్లాప్‌ అయ్యాక.. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకుని దాన్ని ఫిక్స్‌ చేసుకున్నా.

ఆ తర్వాత ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ వంటి మంచి సినిమాలు చేశా. ‘గని’ పరాజయం గురించి చెప్పాలంటే.. తప్పు ఎక్కడ జరిగిందో మాకు తెలుసు. ప్రతి సినిమాకు టార్గెట్‌ ఆడియన్స్‌ ఉంటారు. కానీ, ఈ సినిమాని అందరికీ చేరువ చేయాలనుకున్నాం. అలా, ప్రతి ఒక్క అంశాన్ని స్క్రిప్ట్‌లో భాగం చేశాం. అదే మేము చేసిన పెద్ద తప్పు. సరైన స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కించాలనుకున్నాం. కాకపోతే దాన్ని తెరపైకి తీసుకురావడంలోనే తప్పులు దొర్లాయి.

రిలీజ్‌కు ముందు సినిమా చూసినప్పుడే నాకు అర్థమైంది. కాకపోతే, ఎక్కడో చిన్న నమ్మకం చివరి వరకూ ఉండేది’’ అని ఆయన వివరించారు. మరో ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ హీరోల గురించి వరుణ్‌ మాట్లాడుతూ.. ‘‘మా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కలిస్తే సినిమాల గురించి మాట్లాడుకోం. వెకేషన్స్‌, ఇతర విషయాల గురించి సరదాగా చర్చించుకుంటాం. (Varun Tej) నేనూ- సాయి తేజు ఏదో తప్పు చేస్తే పవన్‌ బాబాయ్‌ ఒకసారి తిట్టారు.

ఆయన మాటలు మాకొక పాఠాన్ని నేర్పించాయి. ఇండస్ట్రీలో మనల్ని మనం నిరూపించుకోవాలని అర్థమైంది. అందుకోసం కష్టపడటం నేర్చుకున్నాం. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకోవాలనే నా ఆలోచనకు బాబాయ్‌ మాటలే ఒక కారణం’’ అని వరుణ్‌ తెలిపారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus