Varun Tej, Lavanya: ఇక సినిమా కోసం జంటగా సందడి చేసిన మెగా కొత్త జంట!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి జరిగిన పది రోజులకి ఈ జంట మొదటిసారి ఒక సినిమా వేడుకలలో పాల్గొని సందడి చేశారు .ఇలా సినిమా వేడుకలో భాగంగా ఇద్దరు జంటగా కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిహారిక కొత్త సినిమా వేడుకలలో పాల్గొని సందడి చేశారు.

నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు తన ప్రొడక్షన్లో కేవలం వెబ్ సిరీస్ మాత్రమే నిర్మించారు. అయితే మొదటిసారి ఒక సినిమా ద్వారా ఈమె నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సినిమా వేడుకలలో భాగంగా నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు

అనంతరం వెంకీ కుడుమల గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సినిమా స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం నిహారిక మాట్లాడుతూ ఇప్పటివరకు తమ ప్రొడక్షన్లో వెబ్ సిరీస్లో మాత్రమే వచ్చాయని మొదటిసారి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈమె తెలియజేసారు ఇలా కొత్తవారితో సినిమా చేయడం పెద్ద బాధ్యత అంటూ నిహారిక తెలిపారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా (Varun Tej) వరుణ్ తేజ్ లావణ్య జంటగా పాల్గొని సందడి చేశారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus