Varun Tej: వరుణ్‌తేజ్‌ కొత్త సినిమా పోస్టర్‌ చూశారా? కుర్ర హీరోలు చేయని విధంగా..

కెరీర్‌ బండి సాఫీగా సాగుతున్నప్పుడు ప్రయోగాలు చేస్తే.. కాన్ఫిడెన్స్‌తో చేస్తున్నాడు అని అంటారు. అదే ఆ బండి కాస్త అటు ఇటుగా వెళ్తుంటే.. హిట్‌ కోసం రిస్క్‌ చేస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఇలాంటి మాటలు అనిపించుకుంటున్న హీరోలు చాలామందే ఉన్నారు. అందులో వరుణ్‌తేజ్‌ (Varun Tej) కూడా వచ్చాడు. దానికి కారణం ఆయన నుండి వచ్చిన కొత్త సినిమా పోస్టర్‌. డబుల్‌ ఇంపాక్ట్‌ అంటూ ‘మట్కా’ (Matka) సినిమా కొత్త పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది.

Varun Tej

ఆ పోస్టర్‌లో వరుణ్‌తేజ్‌ యువకుడిగా, మధ్య వయస్కుడిగా కనిపించాడు. 24 ఏళ్ల ప్రయాణం ఉన్న ఈ కథలో మొత్తం నాలుగు అవతారాల్లో వరుణ్‌తేజ్‌ కనిపిస్తాడని, ఇవి రెండు లుక్స్‌ అని చెబుతున్నారు. దీంతో వరుణ్‌ తేజ్‌ సాలిడ్‌ హిట్‌ కోసం చేస్తున్న ప్రయత్నం ఇది అని ఫ్యాన్స్‌ అంటున్నారు. కరుణకుమార్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి (Nora Fatehi) , మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary) కథానాయికలు.

అన్నట్లు హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందట. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. విశాఖపట్నం నేపథ్యంలో, పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న చిత్రమిదని ఇప్పటికే టీమ్‌ చెప్పేసింది. కథ సాగే కాలానికి తగ్గట్టుగా వింటేజ్‌ లుక్‌తో వరుణ్‌తేజ్‌ నాలుగు పాత్రను సిద్ధం చేశారని సమాచారం. జూదం లాంటి ఆట మట్కా ఈ సినిమాలో కీలకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ‘మట్కా’ సామ్రాజ్యాధీశుడిగా ఎదిగి, ఆ ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా వరుణ్‌ సినిమాలో కనిపిస్తాడు. మట్కా ఆడి, ఆడించి.. శాసించే సమయాల్లో ఒక్కో లుక్‌ కనిపిస్తుందట. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తారు. వరుసగా భారీ పరాజయాలతో వెనుబడిపోతున్న వరుణ్‌కి ఈ సినిమా విజయం చాలా అవసరం. అందులోనూ పాన్‌ ఇండియా లెవల్‌లోనే సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు. కాబట్టి మంచి ఫలితం వస్తే కెరీర్‌ మరో స్టెప్‌ ఎక్కినట్లే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus