2024 ఏపీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందని పవన్ కామెంట్లతో క్లారిటీ రాగా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే జనసేన పార్టీ తరపున నిహారిక తిరుపతి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని గతంలో చిరంజీవి పోటీ చేసిన స్థానం కావడంతో ఆమె సులువుగా విజయం సాధిస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల గురించి ప్రశ్నలు ఎదురుకావడంతో వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
నిహారిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యుల నిర్ణయం ఆధారంగా ఎన్నికల్లో ప్రచారం విషయంలో నిర్ణయం తీసుకుంటామని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు. బాబాయ్ వెంటే మా కుటుంబం ఉంటుందని వరుణ్ చెప్పుకొచ్చారు. వరుణ్ క్లారిటీతో నిహారిక సినిమాల్లోనే కెరీర్ ను కొనసాగించనున్నారని క్లారిటీ వచ్చేసింది.
ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ (Varun Tej) ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. ఈ సినిమాకు వరుణ్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. పెద్దగా పోటీ లేకుండానే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుండగా ఈ సినిమాతో వరుణ్ తేజ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాల్సి ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1వ తేదీన మాత్రం కచ్చితంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మహాశివరాత్రి సెలవును సైతం ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.