Varun Tej: పవన్ తర్వాత అలా పెళ్లి చేసుకుంటున్న వరుణ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈయన నటి లావణ్య త్రిపాఠి ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇలా వీరి నిచ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట రహస్యంగా వారి ప్రేమ విషయాన్ని ఉంచి ఇలా నిశ్చితార్థంతో అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకున్న నేపథ్యంలో కేవలం సినిమాలో విషయంలోనే కాకుండా వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నారంటూ పలువురు ఈయన పెళ్లి గురించి చర్చలు

జరుపుతున్నారు.మెగా ఫ్యామిలీలో ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని ఎవరు పెళ్లి చేసుకోలేదు. చిరంజీవి సురేఖను వివాహం చేసుకున్నారు. ఈమె సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి అయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం కాదు. ఇక నాగబాబు పద్మజను వివాహం చేసుకున్నారు. అల్లు అరవింద్ గీతను వివాహం చేసుకున్నారు.అల్లు అర్జున్ ప్రముఖ విద్యా సంస్థల అధినేత కుమార్తె స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఇక రాంచరణ్ ప్రముఖ బిజినెస్ ఉమెన్ అయినటువంటి ఉపాసన వివాహం చేసుకున్నారు.

వీరెవరు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని కాకుండా ఇతర రంగాలకు చెందిన వారిని వివాహం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి వివాహం పెద్దలు నిశ్చయించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా తనకు విడాకులు ఇచ్చి నటి రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. బద్రి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాలవల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా పవన్ కళ్యాణ్ తర్వాత వరుణ్ తేజ్ (Varun Tej) సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా సినిమాల పరంగా మాత్రమే కాకుండా పెళ్లి విషయంలో కూడా వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారని అయితే పవన్ కళ్యాణ్ మాదిరి ఈయన విడాకులు తీసుకోకుండా పది కాలాల పాటు చాలా సంతోషంగా ఉండాలి అంటూ పలువురు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థపు ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus