ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ “అంతరిక్షం” చిత్రంతో హ్యాట్రిక్ కొడతారనుకున్నారందరూ. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అంతరిక్షం డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో వరుణ్ కాస్త డల్ అయినా.. తన తాజా చిత్రం “ఎఫ్ 2” విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఆ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాడు. కానీ.. ఇప్పుడు వరుణ్ ప్లానింగ్ కి వెంకీ అడ్డొచ్చిపడుతున్నాడు.
మేటర్ ఏంటంటే.. వరుణ్ తేజ్ తన కెరీర్ లో పూర్తిస్థాయి కామెడీ సినిమా ఇప్పటివరకూ చేయలేదు. “ఎఫ్ 2” తన ఫస్ట్ కామెడీ ఫిలిమ్. అయితే.. అగ్ర కథానాయకుడు వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో సమానమైన కామెడీని పండించడం కానీ.. ఆయన స్థాయిలో స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం కానీ వరుణ్ కి కష్టం. ఆ కారణంగా ఒకవేళ “ఎఫ్ 2” సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ మొత్తం వెంకీ ఖాతాలోకే వెళ్లిపోతుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఏమిటనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ లేదు. ఆ కారణంగా.. వరుణ్ ఫ్యాన్స్ తోపాటు మెగా అభిమానులు కూడా పాపం వరుణ్ తేజ్ అంటూ బాధపడుతున్నారు. .