‘లోఫర్’ తర్వాత చాలా కాలంపాటు కెమెరాకి దూరమయ్యాడు వరుణ్ తేజ్. క్రిష్ తో చేయాల్సిన రెండో సినిమా ఆగిపోవడం, తర్వాత కథల కోసం కొంతకాలం వెతుకులాట వంటి కారణాల వల్ల ఈ సంవత్సరం తన సినిమా లేనట్టే అని ఫిక్స్ అయిపోయాడు. తీరా దర్శకులు తీసుకొచ్చిన కథలతో సంతృప్తి చెందిన ఈ మెగా హీరో దాదాపు ఒకేసమయంలో రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అవే శ్రీను వైట్ల ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల ‘ఫిదా’. అయితే ‘మిస్టర్’ షూటింగ్ లో కాలు ఫ్రాక్చర్ అవ్వటం మూలాన సుమారు 50 రోజులు మంచం పట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న వరుణ్ వెంటనే షూటింగ్ మొదలెట్టేసాడట. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్టర్’ దాదాపు పూర్తి కావచ్చిందన్న సమయంలో వరుణ్ గాయపడ్డాడు. మరో షెడ్యూల్ పూర్తయితే ఆ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తోంది. కాస్త ఆలస్యమవుతుందనుకున్నా జనవరి నెలాఖరుకు శ్రీను వైట్ల సెట్స్ నుండి ‘మిస్టర్’ వరుణ్ బయటపడటం ఖాయం. తర్వాత దిల్ రాజు నిర్మిస్తోన్న ‘ఫిదా’ పని పడతాడు వరుణ్. మిస్టర్ మార్చ్ లో విడుదలయ్యే అవకాశముందట. ఫిదా మే లేదా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.