Varun, Lavanya: వరుణ్ – లావణ్య ల మధ్య ప్రేమ చిగురించింది అప్పుడేనట..!

లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్…ల ఎంగేజ్మెంట్ నిన్న అంటే జూన్ 9న రాత్రి హైదరాబాద్, మణికొండ లో ఉన్న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల.. సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు నాగబాబు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై అనేక వార్తలు వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కి నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , సుస్మిత కొణిదెల , శ్రీజ కొణిదెల, డాక్టర్ వెంకటేశ్వర రావు వంటి వారు హాజరయ్యారు.

అయితే పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇక ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండీ ఈ జంట వీరి ప్రేమ సంగతుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. 2016 నుండి వీళ్ళు ప్రేమించుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మిస్టర్’ సినిమా షూటింగ్ టైంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు అంతా భావిస్తున్నారు. అయితే వాస్తవానికి అది కాదు. లావణ్య త్రిపాఠి… నిహారిక ఒకే జిమ్ కు వెళ్లేవారు.

అక్కడ వీరి ఫ్రెండ్షిప్ మొదలైంది. తర్వాత నాగబాబు ఇంటికి ఈమె తరచూ వెళ్లి వస్తుండేది. అక్కడ వరుణ్ తో పరిచయం ఏర్పడటం జరిగింది. మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి వేడుకకు నిహారిక ఈమెను ఆహ్వానించేది. తర్వాత ‘మిస్టర్’ సినిమాలో వరుణ్, నిహారిక ల వల్ల లావణ్య హీరోయిన్ గా ఎంపికైంది. అది అసలు మేటర్.

మూడేళ్ళ క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అని లావణ్యని అడిగితే.. ఆమె వరుణ్ తేజ్ (Varun) అని బదులిచ్చి సిగ్గు పడింది. అప్పటి నుండి వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే గాసిప్స్ మొదలయ్యాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus