Varun Tej, Lavanya Trapathi: వరుణ్ తేజ్ లావణ్య వివాహం జరిగేది అక్కడేనా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్యల నిశ్చితార్థం శుక్రవారం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.ఇన్ని రోజులు రహస్య ప్రేమ ప్రయాణం జరిపినటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ శుక్రవారం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిన అనంతరం వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఎక్కడైతే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందో అక్కడే తమ పెళ్లిని చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ఇద్దరు మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో ముందుగా మిస్టర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్ళగా ఇటలీలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ ఇలా పెళ్లి బంధం వైపు అడుగులు వేసేలా చేసిందని తెలుస్తోంది. ఇలా తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే ఇద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.మరి వీరి పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

ఇక మెగా కోడలుగా లావణ్య త్రిపాటి రాబోతున్నారన్న వార్త అభిమానులలో ఎంతో సంతోషాన్ని నింపింది. ఇక వీరి వివాహం గురించి కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.(Varun Tej) వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థం కేవలం మెగా అల్లు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కానీ వివాహం మాత్రం మరింత అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారని తెలుస్తోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus