Varun Tej, Lavanya Tripathi: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి..ల హల్దీ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..ల పెళ్లి ఇటలీలోని టస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుంది. నవంబర్ 1 న .. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ల వివాహం ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరగబోతుంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ ఇటలీ చేరుకుని అక్కడ సందడి చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో కలిసి ఇటలీ వెళ్లిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

అలాగే అక్టోబర్ 30 నుండి వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి (Varun Tej) ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 30 న .. కాక్ టెయిల్ పార్టీ ని హోస్ట్ చేశారు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి. ఇందుకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఈరోజు అనగా అక్టోబర్ 31 న హల్దీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో నాగ బాబు దంపతులు తీసుకున్న ఫోటో హైలెట్ గా నిలిచింది. అయితే నిహారిక ఫోటోలు ఎక్కువగా బయటకు రావడం లేదు. ఇది పక్కన పెడితే.. పసుపు దుస్తుల్లో వధూవరులైన వరుణ్ – లావణ్య త్రిపాఠి చాలా చూడముచ్చటగా ఉన్నారు. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలకి లైకులు వర్షం కురిపిస్తూ.. ‘ఆల్ ది బెస్ట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus