Varun Tej: గని ఫలితం వల్లే వరుణ్ తేజ్ ఇలా చేస్తున్నారా?

ముకుంద సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు వరుణ్ తేజ్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఎఫ్2, ఎఫ్3 సినిమాల విజయాలు హీరోగా వరుణ్ తేజ్ రేంజ్ ను పెంచాయి. అయితే సోలో హీరోగా వరుణ్ తేజ్ నటించి భారీ అంచనాలతో విడుదలైన గని సినిమా మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో కొన్ని ప్రాజెక్ట్ లు కామెడీ కథాంశాలతో తెరకెక్కేలా వరుణ్ తేజ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సినిమాలలో కామెడీ ఉంటే కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని ఈ హీరో బలంగా భావిస్తున్నారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కు అలాంటి కథ చెప్పి మెప్పించే టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరో చూడాల్సి ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సోలోగా వరుణ్ తేజ్ నటించే సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటే వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వరుణ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా వరుణ్ తేజ్ సిద్ధంగా ఉన్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే ఎఫ్4 సినిమాలో కూడా వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకుంటాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్ లో మరెన్నో విజయాలను సొంతం చేసుకుని సినిమాకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే రేంజ్ కు ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus