హీరో అంటే ఇలానే ఉండాలి అనే రూల్ అయితే లేదు కానీ… కొన్ని పాత్రలకు కొంతమంది హీరోలే సరిపోతారు అనే అలిఖిత రూల్ అయితే ఉంది. అంటే మాస్ సినిమాలు చేసే హీరోలు మాసీగా, క్లాస్ చిత్రాలు చేసే హీరోలు క్లాస్ లుక్‌లో ఉండాలి అని అనుకుంటారు. పోలీసు పాత్రకు ఒకలా ఉండాలి అనే మాట కూడా ఉంది. దాదాపు ఇలాంటి మాటే ఇటీవల అన్నారు నాగబాబు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయమైన అతని తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ స్పందించాడు.
‘‘టాలీవుడ్ లో 5’3” హైట్ ఉండే హీరో ఎవరూ లేరు. నేను 6.3 హైట్ ఉంటాను కాబట్టి నాన్న ఫ్లోలో 5.3 అడుగులు అని అన్నారేమో. ఇందులో వివాదం ఏముంది. అయినా టాలీవుడ్‌లో 5.3 అడుగుల ఎత్తు ఉండే హీరో ఎవరున్నారు. చూస్తుంటే కుట్ర పూరితంగా నెగిటివిటీ పెంచుతున్నట్లు ఉంది. ఆ వ్యాఖ్యలు ఆయన అభిప్రాయం తప్ప ఎవరినీ ఉద్దేశించినవి కావు’’ అని వరుణ్ తేజ్ అన్నాడు.
వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మార్చి 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ స్టేజీ మీద నాగబాబు మాట్లాడుతూ హీరోలు, వాళ్ల హైట్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తన కొడుకు ఎత్తు గురించి మాట్లాడాడు. అయితే ‘మా నాన్న ఆ ఉద్దేశంలో మాట్లాడలేదు… అసలు ఆ ఎత్తు ఉన్న హీరో మన ఇండస్ట్రీలో లేరు అని వరుణ్‌తేజ్ క్లారిటీ ఇచ్చాడు.
పొట్టివాళ్లు కొన్ని రకాల పాత్రలకు సెట్ కారు. వాళ్లను చూస్తే నవ్వు వస్తుంది. అందుకే వాళ్లను ఆ క్యారెక్టర్లలో వారిని అంగీకరించలేం అని నాగబాబు కామెంట్స్ చేశారు. ఐదు అడుగుల మూడు అంగులాలు ఉన్న నటుడు పోలీస్ రోల్ చేస్తే కామెడీగా ఉంటుంది. నువ్వు పోలీస్ కాదులేరా అనిపిస్తుంది అని నాగబాబు కామెంట్ చేశారు. దీంతో ఆ కామెంట్స్ ఓ హీరోకి ఆపాదిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు కామెంట్స్ చేసింది తారక్ గురించి అని కొందరు, మరికొందరు రామ్‌చరణ్ గురించి అని మరికొందరు అంటున్నారు.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!