మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా కంచె, ఫిదా సినిమాలతో వరుణ్ తేజ్ మీడియం రేంజ్ హీరోగా ఎదిగారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన తొలిప్రేమ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్2 సినిమాలు వరుణ్ తేజ్ క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచాయి. వరుణ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా సైతం హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్3, గని సినిమాలలో నటిస్తున్నారు. ఎఫ్ 3 సినిమాకు 8కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న వరుణ్ తేజ్ ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కే సినిమా కోసం ఏకంగా పన్నెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే భోగవల్లి ప్రసాద్ మాత్రం 8కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా ఇస్తానని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3 కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎఫ్3 మూవీ రిలీజైన తరువాత వరుణ్ తేజ్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోలలో నాని మాత్రమే పది కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. శర్వానంద్, నితిన్, నాగచైతన్యలను మించి వరుణ్ తేజ్ పారితోషికం ఉండటం గమనార్హం.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?