Varun Tej: కండలు పెంచడం కష్టమే.. నిలబెట్టుకోవడం ఇంకా …

‘గని’ సినిమా పోస్టర్‌ చూశారు కదా… వరుణ్‌ తేజ్‌ భలే కనిపించాడు. ఆ తర్వాత జిమ్‌లో వరుణ్‌ కసరత్తులు చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అందులో అయితే కండలు ఇంకొంచెం టైట్‌ అయినట్లు కనిపించాయి. అలాంటి బాడీ తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా? ఫుడ్‌, ఎక్సర్‌సైజ్‌… ఇలా చాలా విషయాల్లో మార్పు చూపించాలి. అయితే అలాంటి బాడీ తీసుకురావడం ఎంత కష్టమో, ఆ బాడీని మెయింటైన్‌ చేయడం అంత కన్నా కష్టం. ఇప్పుడు వరుణ్‌తేజ్‌ పరిస్థితి ఇదే.

‘గని’లో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. పోస్టర్లు చూస్తేనే అర్థమైపోతుంది. సినిమాను చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. దీంతో ఓ మూడు నెలల్లో నార్మల్‌ డైట్‌కి వచ్చేయొచ్చులే అనుకున్నాడట వరుణ్‌తేజ్‌. దీంతో పాత్ర కోసం అన్నీ మార్చుకొని, కడుపు మాడ్చుకొని కండలు పెంచి, బాడీ ఫిట్‌ చేశాడు. తీరా చూస్తే సినిమా ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఓవైపు నిర్మాతల సమస్య, మరో వైపు కరోనా కష్టం… ఇలా సినిమా ఇబ్బందిపడుతోంది, వరుణ్‌ను ఇబ్బంది పెడుతోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే జులై 30న సినిమా విడుదలయ్యేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. కారణాలు ఏమైనా వరుణ్‌ మాత్రం ఆందోళనలో ఉన్నాడట. ఇప్పుడు డైట్‌ను నార్మల్‌ చేసేసి, షూటింగ్‌ మొదలైనప్పడు మళ్లీ ఫిట్‌ అవుదామా అనే ఆలోచన కూడా చేస్తున్నాడట. అయితే అలా మార్చుకుంటూ పోతే ఆరోగ్యం దెబ్బతింటుందనే ఆలోచన కూడా ఉందట. దీంతో ఏదో ఒకటి తేల్చుకోలేక ‘బాడీ’ కష్టాలు పడుతున్నాడు. హే.. కరోనా ఎంత పని చేశావ్‌!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus