Varun Tej: వరుణ్ తేజ్ కట్నం ఎంత తీసుకున్నారో తెలుసా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసిన సంగతి మనకు తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నటువంటి ఈ జంట పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

వీరిద్దరూ మిస్టర్ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారని ఈ ప్రేమ కాస్త పెళ్లి బంధానికి కారణమైందని తెలుస్తుంది. ఇన్ని రోజులు ప్రేమలో ఉన్నప్పటికీ వీరీ ప్రేమ విషయం బయట పడకుండా జాగ్రత్త పడినటువంటి ఈ జంట అనంతరం పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వరుణ్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నటి లావణ్య త్రిపాఠి నుంచి ఎంత మొత్తంలో కట్న కానుకలు తీసుకున్నారు అనే విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ పెళ్లి కోసం నటి లావణ్య త్రిపాఠి నుంచి ఏమాత్రం కట్నం తీసుకోలేదట. సాంప్రదాయ ప్రకారం వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కట్న కానుకలు ఇవ్వటానికి ముందుకు వచ్చినప్పటికీ వరుణ్ తేజ్ మాత్రం లావణ్య నుంచి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదని తెలుస్తోంది. ఇలా కట్నం తీసుకోకపోవడమే కాకుండా పెళ్లి విషయంలో కూడా గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

లావణ్య నుంచి కట్నం తీసుకోకపోవడమే కాకుండా తమ పెళ్ళి ఇటలీలో ఎంతో ఘనంగా జరుగుతుందని అయితే పెళ్లికి కూడా ఏమాత్రం రూపాయి ఖర్చు లావణ్య తల్లిదండ్రులు పెట్టకుండా ఆ పెళ్లి ఖర్చు మొత్తం తానే భరిస్తానని కూడా చెప్పారట. ఇలా వరుణ్ తేజ్ ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నప్పటికీ ఆ పెళ్లి ఖర్చు మొత్తం మెగా కుటుంబం పెట్టుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా కట్నం విషయంలో వరుణ్ (Varun Tej) ఆలోచించిన తీరు నిజంగా గ్రేట్ అంటూ అందరూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus