మొత్తానికి మెగా హీరో అనిపించుకొన్నాడు…
- August 17, 2017 / 06:02 AM ISTByFilmy Focus
హిందీ-తమిళ భాషల్లో కాస్త క్రేజ్ ఉన్న ప్రతి హీరోకి 50 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఒకటి ఉంది. కానీ.. మన తెలుగులో మాత్రం ఎన్టీయార్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోలకి తప్ప వేరే ఎవరూ 50 కోట్ల మార్క్ ను చేరుకోలేకపోయారు. కానీ.. మెగా హీరో వరుణ్ తేజ్ ఆ రేర్ ఫీట్ ను సుసాధ్యం చేసే పనిలో ఉన్నాడు. విమర్శకుల ప్రశంసలతోపాటు.. ప్రేక్షకుల అభినందనలు అందుకొన్న “ఫిదా” సినిమా సాధించిన సక్సెస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కంటే ఓవర్సీస్ లో “ఫిదా” కలెక్షన్స్ దుమ్ము దులుపుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 44 కోట్ల రూపాయలు వసూలు చేసిన “ఫిదా” 50 కోట్లు మార్క్ చేరుకోవడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వాత ఆ రేర్ ఫీట్ ను చేయగలుతున్నాడు వరుణ్ తేజ్, అది కూడా తాను నటించిన అయిదో సినిమాతోనే. అయిదో సినిమాకే 50 కోట్ల మార్క్ దాటేస్తే ఇక పదో సినిమాకి వంద కోట్ల జాబితాలో స్థానం సంపాదించేస్తాడేమోనని మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చూద్దాం మరి తన తదుపరి చిత్రాలతో మెగా అభిమానులను, తెలుగు ప్రేక్షకులను వరుణ్ ఏమేరకు అలరిస్తాడో. ఇకపోతే.. వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్టర్ టర్నడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. బివిఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన స్మైలీ బ్యూటీ రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













