Varun Tej Weds Lavanya: వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ – లావణ్య ల పెళ్లి ఫోటో..!

దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌ – నటి లావణ్య త్రిపాఠి. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేసి వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇప్ప‌టికే కాక్‌టైల్‌, మెహందీ, హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే!

అయితే పెళ్లి అనంత‌రం కొత్త జంట న‌మ‌స్క‌రిస్తున్న ఫోటో ఒక‌టి తాజాగా సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కాగా క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన అభిమానులు వ‌రుణ్‌-లావ‌ణ్య‌ల జంట‌ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు. అలాగే చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్‌ నుంచి బ్రేక్స్‌ తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం వరుణ్‌ – లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.

‘‘దాదాపు ఐదారేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. నాకేదిష్టమో తనకు బాగా తెలుసు. మా అభిరుచులూ కలవడంతో మా మధ్య స్నేహం ప్రేమగా మారింది. నేనే ముందు ప్రపోజ్‌ చేశా. ఇరు కుటుంబాలూ మా ప్రేమను అంగీకరించాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమకథను పంచుకున్నారు వరుణ్‌ తేజ్‌. తాను వాడుతున్న ఫోన్‌ని సైతం లావణ్యనే గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్పారాయన. వీరి వివాహ బంధం సంతోషంగా ఉండాలని కోరుకుందాం..!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus