Ghani Teaser: గెలిస్తేనే చరిత్రలో ఉంటాం.. వరుణ్ పవర్ఫుల్ పంచ్..!

మెగా హీరో వరుణ్ తేజ్ కథలను సెలెక్ట్ చేసుకోవడం లో చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు. గత కొంతకాలంగా అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి ముఖ్యంగా ఫిదా సినిమా నుంచి వరుణ్ తేజ్ తన మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు కెరీర్లో మొదటిసారిగా ఒక హై వోల్టేజ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. వరుణ్ తేజ్ పవర్ ఫుల్ పంచ్.. అలాగే రామ్ చరణ్ తేజ్ హై వోల్టేజ్ వాయిస్ ఓవర్ తో టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.. అయితే ఎంతమంది పోరాడిన కూడా చివరికి గెలిచేది ఒక్కరు మాత్రమే. ఆ ఒక్కడిని నువ్వే ఎందుకు అవ్వాలి అంటూ ఒక ఆసక్తి కరమైన లైన్ తో మొదలైన ఈ టీజర్ ఎంతగానో ఆలోచింపజేస్తుంది.

ఆశయ సాధనలో హీరో ఏలాంటి అనుభవం ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో ప్రధాన అంశం అని తెలుస్తోంది. ఇక సినిమాలో మదర్ సెంటిమెంట్ తో పాటు బాక్సింగ్ నేపథ్యం అలాగే రొమాంటిక్ స్టొరీ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ తో పాటు కూడా ఫిట్నెస్ కూడా సరికొత్తగా కనిపిస్తోంది. తప్పకుండా సినిమా అంచనాలను అందుకుంటుందని ప్రేక్షకులు కూడా టీజర్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబి నిర్మించగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus