Vasanthi, Marina: మెరీనా , వాసంతీలు కావాలనే కామెంట్ చేశారా ? రాత్రి బెడ్ పై ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ కి ఇచ్చిన బ్యాటరీలో ఫుల్ ఛార్జింగ్ ని కోల్పోయారు. బాలాదిత్య కాల్ మాట్లాడేసరికి బ్యాటరీ జీరో పర్సెంట్ అయ్యింది. దీంతో చేసేదేమీ లేక హౌస్ మేట్స్ ముచ్చట్లు పెట్టారు. ఇక పడుకోబోయే ముందు కీర్తి, మెరీనా ఇంకా వాసంతీ ముగ్గురూ ఒకే బెడ్ పైన కూర్చుని ఆదిరెడ్డి వైఫ్ వీడియో కాల్ గురించి మాట్లాడారు. ఆమె కాల్ మాట్లాడేటపుడు యాటిట్యూడ్ చూపించింది చూశారా అంటూ వాసంతీ కామెంట్ చేసింది.

అంతేకాదు, అసలు ఇంట్లో మనం ఆయనకి గుర్తు ఉండటం లేదని, డిసర్వ్ క్యాండెట్స్ అందరూ బయటకి వెళ్లిపోతున్నారని ఎలా కామెంట్ చేస్తాడు అంటూ ఆదిరెడ్డి పై కామెంట్స్ మొదలుపెట్టింది. మెరీనా మాట్లాడుతూ ఆదిరెడ్డి వైఫ్ కవిత తప్పులేకపోతే ఇచ్చిపారేసేయ్ అంటూ మాట్లాడిందని, అదే తప్పు ఉంటే మనం ఊరుకుంటామా, మనం కూడా ఇచ్చిపారేస్తామ్ అంటూ వాసంతీ మాటలకి వత్తాసు పలికింది. మద్యలో పడుకున్న కీర్తి కూడా అవునన్నట్లుగా తలూపింది. అంతేకాదు, ఆమె వీడియో కాల్ లో ఇచ్చిపారేసేయ్ అని ఎలా అంటుందంటూ కామెంట్స్ చేస్కున్నారు ముగ్గురూ.

బెడ్ పైన పడుకుని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని వేడెక్కించాయి. ఆదిరెడ్డి హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఏమన్నా అనొచ్చని, కానీ వీడియో కాల్ చూసి వాళ్ల వైఫ్ ని కామెంట్ చేయడం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరో మేటర్ ఏంటంటే., ఆదిరెడ్డి వీడియోకాల్ లో వాళ్ల వైఫ్ కవిత గ్రీన్ బాల్ పట్టుకుని నువ్వు సేఫ్ గానే ఆడుతున్నావని హింట్ ఇఛ్చింది. దీంతో మనోడు హౌస్ లో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు.

సుదీపతో గార్డెన్ ఏరియాలో కూర్చుని మీ మైనస్ ఏంటంటే, మెరీనా, రోహిత్, వాసంతీ, చంటి, బాలాదిత్య వీళ్ల చుట్టూ మీరు ఉండిపోయారు కాబట్టి వాళ్ల తప్పులు మీకు కనిపంచవు అంటూ సలహాలు ఇచ్చాడు. మీలో ఉన్న నెగిటివిటీ అదే అని, నాకు అయితే, ఒక్కరే ఉన్నారు , కానీ మీకు మాత్రం నలుగురు ఉన్నారంటూ హితవు పలికాడు. మొత్తానికి ఆదిరెడ్డి వైఫ్ కవిత వీడియో కాల్ వీకండ్ నాగార్జున ఎపిసోడ్ లో వేడిపుట్టించేటట్టే ఉంది. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus