బుల్లితెరపై ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానీకి వస్తే… కాలేజ్ చాలా ఇబ్బందులలో ఉంది. మన కాలేజ్ మన చేయి జారిపోయే పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా నువ్వు రాకపోవడం ఏంటి అంటూ రిషిని తల్లిదండ్రులు బ్రతిమలాడిగా రిషి మాత్రం రానని చెబుతాడు. వసుధర మాట్లాడుతూ మీకు మాపై కోపం ఉంటే కాలేజ్ ఏం చేసింది మీరు కాలేజీలోకి వెళ్లడానికి మీ ఈగో అడ్డు వస్తుందా మీ ఆత్మ అభిమానం దెబ్బతిందా అంటూ రిషి పై కేకలు వేస్తుంది.
మీ తాతయ్య స్థాపించినటువంటి ఆ కాలేజ్ ని నువ్వు విస్తరింప చేశావు అలాంటి కాలేజీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులలో ఉంది నువ్వు వచ్చి తీరాలి అంటూ మహేంద్ర చెప్పినప్పటికీ నేను ఆ కాలేజీ లోకి అడుగుపెట్టలేను డాడీ ఆ కాలేజ్ ఎండి గారు ఎంతో సమర్థవంతురాలు ఆమె ఏ సమస్యను పరిష్కరిస్తుంది. ఆమెకు తోడుగా ఆమె శిష్యురాలు కూడా ఉంది. తను కూడా చాలా సమర్థవంతరాలు కావాలంటే తనని తీసుకెళ్లండి అంటూ రిషి మాట్లాడతారు. మీరు చెప్పిన చెప్పకపోయినా నేను కాలేజీకి వెళ్తాను.
నేను ఆ కాలేజీలో చదువుకున్నాను. సమస్యలలో ఉన్నటువంటి ఆ కాలేజీకి అండగా నిలబడి నేను నా రుణం తీర్చుకుంటాను అంటూ వసుధర మాట్లాడుతుంది పదండి సర్ రిషి సార్ రారు మనం వెళ్దాం అంటూ ముగ్గురు వెళ్తారు. మరోవైపు ఎమ్మెస్సార్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అంటూ కంగారు పడుతూ ఉంటారు. ఇక దేవయాని శైలేంద్ర బయటకు వెళ్ళగా ఈ జగతి మహేంద్ర రారని చెప్పావు ఇలా జరిగిందేంటి అని మాట్లాడుతూ ఉండగానే అక్కడికి మహేంద్ర జగతి రావడమే కాకుండా వసుధార రావడం చూసి షాక్ అవుతారు.
అంతలోపు ఫణీంద్ర అక్కడికి వచ్చి ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటూ అనడంతో జగతి వాళ్ళని చూపిస్తుంది. అసలు పిన్ని బాబాయ్ ఎక్కడికి వెళ్లారు మీకు తెలుసా డాడీ వాళ్లు ఇన్ని రోజులు రిషి వద్దకు వెళ్లారు. వారికి రిషి ఎక్కడ ఉన్నారో తెలుసు వారు విష్ కాలేజీలో పని చేస్తున్నారు అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను చూపిస్తారు. దాంతో ఫణీంద్ర షాక్ అవుతారు. అంతలోపు జగతి వాళ్ళు రావడంతో మీరు ఎక్కడికి వెళ్లారు అని ఫణింద్ర ప్రశ్నించగా ఆ విషయాలన్నీ తర్వాత చెబుతాము అంటూ జగతి మాట్లాడుతుంది.
ఇప్పుడే చెప్పాలి మీరు రిషి వద్దకు వెళ్లారా అని అడగడంతో ఆవునని చెబుతారు. దాంతో ఇన్ని రోజులు మీరంతా ఒక్కటయి నన్ను వేరు చేశారా నన్ను చీకటిలోకి నెట్టేసారా అంటూ ఫణింద్ర బాధపడతారు అయితే జగతి మాత్రం ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడే సమయం కాదు బావగారు అన్ని విషయాలు మీకు తర్వాత చెబుతాను ముందు ఎమ్మెస్సార్ ఎక్కడ ఉన్నారో చెప్పండి. ముందు ఈ సమస్యను పరిష్కరించుకుందాం అని మాట్లాడటంతో ఫణీంద్ర తనని ఎమ్మెస్సార్ వద్దకు తీసుకువెళ్లి పోతారు.
ఇక జగతి మహేంద్ర వసుధార ముగ్గురు కూడా ఎమ్మెస్సార్ ఆటలు సాగనివ్వరు. నేనేమీ కాలేజ్ ఊరికే తీసుకోలేదు అప్పుగా డాక్యుమెంట్లపై సంతకం పెడితేనే ఈ కాలేజ్ పై హక్కుతో అడుగుతున్నాను అనడంతో అవన్నీ కూడా చెల్లవని జగతి వసుధార అడ్డుకుంటారు దాంతో చేసేదేమిలేక ఎమ్మెస్సార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కాలేజ్ కూడా చేజారిపోవడంతో శైలేంద్ర దేవయాని చాలా కోపంతో ఉంటారు. ఇక ఎమ్మెస్సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలేజీలో జరిగిన ఈ విషయం మొత్తం రిషికి చెప్పాలని వసుధార బయటకు వెళ్లి ఫోన్ చేస్తుంది.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!