డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారిని సత్కరించేందుకు నిర్వహించిన ‘VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025’ వేడుక . ఈ వేడుకలో డిజిటల్ మీడియా రంగంలో వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులు అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో వీబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ‘VB ఎంటర్టైన్మెంట్స్’ అధినేత ఇంకా ‘ఈసీ మెంబర్ ఆఫ్ మా’ అయిన విష్ణు బొప్పన ఫౌండర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విజేతలు అవార్డులు అందుకుని, తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజేతలకు సీనియర్ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందాయి.
ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ గారు మాట్లాడుతూ.. విజేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రింట్ మీడియా కంటే డిజిటల్ మీడియా ఇంకా బాగా అభివృద్ధి చెందింది అన్నారు. డిజిటల్ మీడియా ప్రజలకు ఇంకా ఎన్నో మంచి వార్తలు ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. అలాగే విష్ణు గారి గురించి కూడా ఈ సందర్బంగా మాట్లాడారు. ఆయన చేసిన మంచి పనులని తెలియజేశారు. గత 10 సంవత్సరాల నుంచి చిన్న పిల్లలకు విష్ణు ఎన్నో విధాలుగా సాయపడ్డారని గుర్తు చేశారు. అనాధ పిల్లలకు అండగా నిలిచారని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సోషల్ ఎవెర్నెస్ కల్పించిన వారికి అవార్డులు ఇవ్వడాన్ని అభినందించారు.
అనంతరం విష్ణు గారు మాట్లాడుతూ.. ముఖ్య అతిధులుగా విచ్చేసిన పెద్దలు అంబికా కృష్ణ, KS రామారావు గార్లకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం పేద పిల్లలకి సాయం చెయ్యడానికి తనకి తోడుగా వస్తున్న స్పాన్సర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
విజేతల వివరాలు:
రవి శంకర్ (తెలుగు వన్) – బెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఛానల్ అవార్డు
సుమన్ (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా ఛానల్ అవార్డు
జాఫర్ (ఇట్లు మీ జాఫర్) – టీఎన్ఆర్ మెమోరియల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
రోహిత్ (ఆర్‌టీవీ) – బెస్ట్ పాపులర్ యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ప్రభు (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
వీఎస్ఎన్ మూర్తి (గ్రేట్ ఆంధ్ర) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
నాగరాజు (ఇట్స్ యూ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
అంజలి (ఐడ్రీమ్) – బెస్ట్ డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అవార్డు
బీఎస్ (ఎస్ టాక్ షో) – బెస్ట్ డిజిటల్ మీడియా యాంకర్ (మేల్) అవార్డు
స్వప్న (ఐడ్రీమ్) – బెస్ట్ డిజిటల్ మీడియా యాంకర్ (ఫిమేల్) అవార్డు
వంశీ కూరపాటి(రా టాక్స్ విత్ వీకే) – బెస్ట్ డిజిటల్ మీడియా క్రియేటివ్ యాంకర్ (మేల్) అవార్డు
నీరుపమ (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా క్రియేటివ్ యాంకర్ (ఫిమేల్) అవార్డు
నిఖిల్ విజయేంద్ర సింహ – బెస్ట్ డిజిటల్ మీడియా పాడ్‌కాస్ట్ యాంకర్ అవార్డు
గీతాంజలి (సుమన్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా డివోషనల్ యాంకర్ అవార్డు
డాక్టర్ నాగేశ్వర్రావు పూజారి – బెస్ట్ డిజిటల్ లైఫ్ కౌన్సెలర్ (మేల్) అవార్డు
రమ్య కుమారి అకుల – బెస్ట్ డిజిటల్ లైఫ్ కౌన్సెలర్ (ఫిమేల్) అవార్డు
రమేష్ చందు (బాక్స్ ఆఫీస్) – బెస్ట్ డిజిటల్ వీక్లీ అవార్డు
బ్రదర్ షఫీ – బెస్ట్ డిజిటల్ మీడియా మోటివేటర్ అవార్డు
క్రాంతి (కేఆర్ టీవీ) – బెస్ట్ డిజిటల్ మీడియా ట్రెండింగ్ యాంకర్ (మేల్) అవార్డు
జాస్మిన్ (జేఆర్ 7 మీడియా) – బెస్ట్ డిజిటల్ మీడియా ట్రెండింగ్ యాంకర్ (ఫిమేల్) అవార్డు
తేజస్వి సజ్జ – బెస్ట్ విమెన్ పీఆర్ఓ అవార్డు
కునపరెడ్డి అనిల్ (బ్రాండ్ మల్టీమీడియా) – బెస్ట్ డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అవార్డు
ఇక ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌లుగా ‘ఎస్‌ఆర్ఆర్’, ‘శ్రీ విజయ గణపతి ఎవెన్యూస్’, ‘ముకుంద జ్యువెలరీ’, ‘వాకృతి ఇన్ఫ్రా’, ‘ప్రోసిఫ్’, ‘కనక వస్త్ర సిల్క్స్’, ‘Hygi హెల్త్ ఫుడ్స్’, ‘బ్రాండ్ మల్టీమీడియా’, ‘అంబిక’ వంటి సంస్థలు వ్యవహరించాయి.డిజిటల్ మీడియా రంగంలో కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ అవార్డ్స్ వేడుక, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా చేసిందని నిర్వాహకులు తెలిపారు.