వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత దాంపత్య జీవితం చాలా ముఖ్యం. భార్యాభర్తలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. లేదు అంటే వివాహ బంధాలు అనేవి మొగ్గలోనే రాలిపోతాయి. చాలా మంది కపుల్స్ విడాకుల బయటపెట్టడానికి ఇదే కారణం. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది విడాకుల బాట పట్టడానికి కారణం ఇదే అని అంతా చెబుతారు. ఇక్కడి జనాలు ఎక్కువగా ఎఫైర్స్ నడపడానికి కారణం కూడా ఇదే అని చెబుతుంటారు.
ఓ నటుడు చెప్పిన మాటలని బట్టి చూస్తే.. అవి నిజమని చాలా మంది ఒప్పుకుంటారు.వివరాల్లోకి వెళితే.. మలయాళ నటుడు జనార్దనన్(Janardhanan) తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలీకపోవచ్చు. కానీ అక్కడ ఈయన స్టార్ యాక్టర్. దాదాపు 500 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ విలన్ గా, మెయిన్ విలన్ గా ఇలా ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఉన్నత స్థానాన్ని అధీష్టించాడు.
కేరళకి చెందిన ఇతనికి విజయలక్ష్మీ అనే ఆమెని 1972 లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2000 సంవత్సరంలో అంటే 54 ఏళ్ళ వయసులో మరో మహిళతో ఇతను ఎఫైర్ పెట్టుకున్నాడు. దాదాపు 18 ఏళ్ళ పాటు ఆ ఎఫైర్ కొనసాగించాడు.దాని వల్ల ఇతను ఎన్నో కాంట్రోవర్సీల్లో చిక్కుకున్నాడు. కానీ తర్వాత ఆమెతో బ్రేకప్ అయ్యాడు.
అందుకు కారణం.. ఆమె కొడుకు పెద్దవాడు అవ్వడంతో సమాజం ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతో సెపరేట్ అయినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతను ఎఫైర్ నడపడానికి కారణం..అతని భార్య విజయలక్ష్మీ సె*క్స్ కి సహకరించకపోవడమే అని తెలిపి షాకిచ్చాడు. ఇతను ఎఫైర్ నడిపిన విషయం తన భార్యకి కూడా తెలుసనీ.. ఆమెకు ఇబ్బంది లేకపోవడం వల్లనే 18 ఏళ్ళ పాటు ఎఫైర్ నడిపినట్టు తెలిపి సంచలనం సృష్టించాడు.
