ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలకే పరిమితం అనే అపోహ ఉండేది. కానీ, రష్మిక మందన్నా ఆ అపోహను బద్దలు కొట్టే పనిలో పడింది. కేవలం 11 నెలల కాలంలో ఏకంగా ఐదు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరించింది. ఇది కేవలం అదృష్టం కాదు, ఆమె కెరీర్‌ను మలచుకుంటున్న ఒక పక్కా వ్యూహంలా కనిపిస్తోంది. ‘పుష్ప 2’లో డీ గ్లామ్ ‘శ్రీవల్లి’గా మాస్ ఆడియన్స్‌కు దగ్గరైన ఆమె, అదే సమయంలో ‘ఛావా’లో ‘యేసు భాయ్’గా రాజసం ఉట్టిపడే రాజరికపు పాత్రలో కనిపించింది.
Rashmika Mandanna
అలాగే రష్మిక ‘కుబేర’ సినిమాను ఒప్పుకోవడం ఒక సాహసమనే చెప్పాలి. ఇందులో ఆమెది పూర్తిస్థాయి హీరోయిన్ పాత్ర కాదు, ‘సమీరా’ అనే ఒక భిన్నమైన క్యారెక్టర్. బిచ్చగాడికి సహాయం చేసే ఆ పాత్ర ద్వారా నటిగా కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ‘యానిమల్’ తర్వాత ఆమెపై పడిన ‘గ్లామర్’ ట్యాగ్‌ను చెరిపేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది.
అయితే, ఈ ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయా అంటే, ‘థామా’ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ‘బేతాళ’ పాత్రతో హారర్ ట్రై చేసినా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. ఇటీవల వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో మళ్లీ ‘ఇన్నోసెంట్’ అమ్మాయి పాత్రలో కనిపించింది. ఇలా 11 నెలల్లో ‘మాస్’, ‘రాయల్’, ‘క్యారెక్టర్ రోల్’, ‘హారర్’, ‘ఇన్నోసెంట్’.. అంటూ ఐదు విభిన్న షేడ్స్ చూపించడం ద్వారా రష్మిక ఒకేసారి అన్ని జానర్లనూ టచ్ చేసింది.
ఆమె కెరీర్ ‘కిరిక్ పార్టీ’తో మొదలై ‘ఛలో’, ‘గీత గోవిందం’లతో ఇక్కడ స్టార్ డమ్ తెచ్చిపెట్టినా, ‘పుష్ప’ ఆమెను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఇప్పుడు ఆ పాన్ ఇండియా ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఆమె స్క్రిప్టులను ఎంచుకుంటోంది. ‘మైసా’, ‘రెయిన్బో’ లాంటివి కూడా ఈ లిస్ట్‌లోనివే.
కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్నా, రష్మిక వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. విజయ్ దేవరకొండతో డేటింగ్, రహస్య నిశ్చితార్థం జరిగిపోయిందన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఈ వార్తలను అధికారికంగా ప్రకటించకపోయినా, రష్మిక అప్పుడప్పుడు పరోక్షంగా హింట్లు ఇస్తూనే ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్ ప్యాలెస్‌లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని కూడా ప్రచారం జరుగుతోంది.
