టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్‌గా దిల్ రాజుది ఓ స్పెషల్ స్టైల్. ఆయన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి సినిమా వస్తుందంటే, అది పక్కా ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు. దిల్, ఆర్య, బొమ్మరిల్లు.. ఇలా ఆయన కెరీర్ మొదట్లో వరుస హిట్లు కొట్టింది కొత్త దర్శకులను నమ్మే. సుకుమార్, బోయపాటి, వంశీ పైడిపల్లి లాంటి ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చేసి, వారిని స్టార్స్‌గా మార్చింది దిల్ రాజు బ్యానరే.
Dil Raju
ఆ ఫార్ములానే ఆయన్ను ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టింది. అయితే, గత కొంతకాలంగా దిల్ రాజు ఫోకస్ పెద్ద దర్శకుల మీద, పాన్ ఇండియా ప్రాజెక్టుల మీదకు మళ్లింది. ఈ క్రమంలో, ఆయన పాత ‘కొత్త టాలెంట్’ ఫార్ములా కాస్త పక్కకు వెళ్లింది. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే న్యూస్ ఒకటి బయటికొచ్చింది. దిల్ రాజు మళ్లీ తన పాత ఫార్మాట్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఏకంగా వచ్చే ఏడాది ఏడుగురు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు గట్టిగా టాక్ నడుస్తోంది. ఇది టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ‘లక్కీ 7’ ప్లాన్ కూడా చాలా వైవిధ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడుగురిలో, ఇద్దరు దర్శకులతో నేరుగా ఓటీటీ ఒరిజినల్స్ (సినిమాలు/సిరీస్‌లు) ప్లాన్ చేస్తున్నారట. అంటే, మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు దిల్ రాజు డిజిటల్ మార్కెట్‌పైనా సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది.
మరో రెండు ప్రాజెక్టులు ఏకంగా USA బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయట. మిగిలిన మూడు ప్రాజెక్టులు థియేట్రికల్ రిలీజ్‌ల కోసమేనని తెలుస్తోంది. ఈ ప్లాన్ చూస్తుంటే, దిల్ రాజు ఒకే దెబ్బకు అన్ని మార్కెట్లనూ టార్గెట్ చేస్తున్నట్లుంది. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల కొరత తీవ్రంగా ఉన్న ఈ సమయంలో, దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైంది. పెద్ద డైరెక్టర్లంతా పాన్ ఇండియా స్టార్లతో బిజీగా ఉండటంతో, మిడ్ రేంజ్ హీరోలకు, కొత్త కాన్సెప్ట్‌లకు దర్శకులు దొరకడం కష్టంగా మారింది.
ఈ గ్యాప్‌ను గుర్తించిన దిల్ రాజు, మరోసారి ‘టాలెంట్ హంట్’ మొదలుపెట్టారు. ఈ ఏడుగురిలో కనీసం ఇద్దరు ముగ్గురు దర్శకులు క్లిక్ అయినా, అది ఆయన బ్యానర్‌కు రాబోయే పదేళ్లకు పెద్ద అండగా మారుతుంది. స్టార్ డైరెక్టర్లను నమ్ముకుంటే వచ్చే హిట్లు వేరు, కొత్తవాళ్లను నమ్మి కొట్టే హిట్లు వేరు. రెండోది ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు బ్రాండ్‌ను మరింత పెంచుతుంది.
