Veera Simha Reddy: వీరసింహారెడ్డి మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదేనా?

ఎంతగానో వేచి చూస్తున్న సంక్రాంతి రానే వస్తుంది. ఇక ఈ సంక్రాంతిని నందమూరి అభిమానులకు మరింత స్పెషల్ గా మార్చేందుకు బాలయ్య బాబు రెడీ అయిపోయాడు. ఈ సారి “వీర సింహారెడ్డి” గా మన ముందుకు రానున్నాడు బాలయ్య. నార్మల్ గానే బాలయ్య మూవీ అంటే తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఒక సంచలనం గా ఉంటుంది. అలాంటిది ఇక సంక్రాంతి బరిలో బాలయ్య సందడి మాములుగా ఉండదని ఇప్పటికే నందమూరి అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, ట్రైలర్, డైలాగ్స్ విశేషమైన ఆదరణ పొందాయి.

అయితే ప్రస్తుతం బాలయ్య “వీర సింహారెడ్డి” మూవీ గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్త విని బాలయ్య అభిమానులు ఉర్రుతలూగిపోతున్నారు. పండుగకు రిలీజ్ కు రెడీ అయిన వీరసింహారెడ్డి.. ఇంటర్వెల్ సీక్వెన్స్ కు సంబంధించిందే అప్ డేట్. ఏ సినిమాలో సీనియర్ బాలయ్య పాత్రకు చెల్లి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర నమ్మించి మోసం చేసి, కత్తిపోటుతో బాలయ్య బాబును చంపేస్తారని.. ఈ సీన్ విపరీతమైన భావోద్వేగాలతో కూడుకొని ఉంటుందని టాక్.

ఇక ఈ సీన్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఇదే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సీన్ సీక్వెన్స్ లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తో రోమాలు నిక్కబొడుచుకుంటాయని సినీ జనాలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మామూలుగానే బాలయ్య సినిమాలో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలుసు. ఇక ప్రస్తుత సినిమాకు సంబంధించి ఈ అప్ డేట్ లీక్ అవ్వడంతో అభిమానులు మరింత ఆతృతగా వేచిచూస్తున్నారు.

ఇలా మూవీకి సంబంధించి ఒక్కో అప్ డేట్ వస్తుండటంతో బాలయ్య అభిమానుల్లో ఉత్సాహం అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. బాలయ్య బాబు అభిమానులే కాకుండా సాధారణ తెలుగు ప్రేక్షకులు సైతం వీర సింహారెడ్డి సినిమా కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఈ సినిమాపై అంతలా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమా చూడడానికి మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. ఈ హడావిడి చూస్తూ ఉంటె సినిమా సూపర్ హిట్ ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus