నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్.. లు హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది.
దీంతో బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 14.20 cr |
సీడెడ్ | 11.50 cr |
ఉత్తరాంధ్ర | 7.50 cr |
ఈస్ట్ | 5.00 cr |
వెస్ట్ | 4.20 cr |
గుంటూరు | 6.30 cr |
కృష్ణా | 5.20 cr |
నెల్లూరు | 2.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 56.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.80 cr |
ఓవర్సీస్ | 6.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 67.20 cr (షేర్) |
‘వీరసింహారెడ్డి’ చిత్రానికి రూ.67.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.68 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే చెప్పాలి. బాలయ్య గత చిత్రం ‘అఖండ’ రూ.70 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. ఈ సినిమాకి సంక్రాంతి సీజన్ కలిసొస్తుంది కాబట్టి.. కమర్షియల్ గా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని చెప్పాలి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!