Veera Simha Reddy: ఆరోజు నుంచి వీరసింహారెడ్డి స్ట్రీమింగ్.. కానీ?

స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. రిలీజ్ రోజున ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం మరో విధంగా ఉంది. క్రిటిక్స్ అంచనాలకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ నెల 21వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో ఇప్పటీ దాదాపుగా 60 షోలు ఈ సినిమా ప్రదర్శించబడుతోంది. అయితే వీరసింహారెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీరసింహారెడ్డి ఓటీటీలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఓటీటీ రూల్స్ ను నిర్మాతలు పట్టించుకోవడం లేదని సమాచారం.

వీరసింహారెడ్డి సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు సైతం సబ్ స్క్రైబర్లను పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య నటించిన అఖండ సినిమా ఇదే ఓటీటీలో విడుదలై అంచనాలకు మించి రెప్సాన్స్ ను సొంతం చేసుకుని ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. వీరసింహారెడ్డి అఖండ సినిమాను మించిన రెస్పాన్స్ ను అందుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వేర్వేరు కారణాల వల్ల థియేటర్లలో వీరసింహారెడ్డి మూవీ చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను చూడాలని అనుకుంటున్నారు. చిరంజీవి సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి నెట్ ఫ్లిక్స్ ప్రాధాన్యత ఇస్తుండగా బాలయ్య సినిమాల డిజిటల్ హక్కులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రాధాన్యత ఇస్తోంది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus