బాలయ్య షోలో కంటతడిపెట్టిన గోపిచంద్.. ఓదార్చిన వరలక్షీ శరత్ కుమార్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతో తెలుగు ప్రేక్షకాభిమానులకు మరింత దగ్గరయ్యారు. కంప్లీట్ డిఫరెంట్‌గా మారిపోయి హోస్ట్‌గా ఫస్ట్ సీజన్‌ని ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలబెట్టారు. సెకండ్ సీజన్‌లో ఇద్దరు, ముగ్గురు కుదిరితే నలుగురు గెస్టులతో అలరిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ రెండు పార్టులు ఎంతలా ఆకట్టుకున్నాయో తెలిసిందే. పవన్ కళ్యాణ్ తర్వాత ప్లాన్ చేసిన లేటెస్ట్ ఎపిసోడ్‌లో ‘వీరసింహా రెడ్డి’ టీమ్ సందడి చేశారు.

డైరెక్టర్ గోపిచంద్ మలినేని, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, ‘దునియా’ విజయ్, రైటర్ సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు నవీన్, రవి శంకర్ తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. శృతి హాసన్ మాత్రం అనారోగ్యం కారణంగా రాలేదని తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న ప్రీమియర్ కానుంది. ఎప్పటిలానే తన స్టైల్లో అదరగొట్టేశారు బాలయ్య.. బాలకృష్ణ సినిమాలో వర విలనా?

లేక వర విలన్‌గా నటిస్తున్న సినిమాలో బాలకృష్ణ హీరోనా? అంటూ స్టార్ట్ చేసిన బాలయ్య ప్రోమోతో ఆకట్టుకున్నారు. నేనే హైపర్ అంటే మీరు నాాకన్నా హైపర్ అంటూ వరలక్ష్మీ.. నేను ఊహించిన దాని కంటే మీరు డిఫరెంట్‌గా ఉన్నారంటూ హనీ రోజ్ చెప్పారు. ఇక బాలయ్య – వర ఇద్దరూ కుస్తీ పట్లు పట్టారు.నిర్మాత నవీన్.. ‘అన్‌స్టాపబుల్’ రిలీజ్ అయిన గంటకి ప్రతి ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం కానీ ఇక్కడికొచ్చాక టెన్షన్‌గా ఉందని చెప్పడం..

అలాగే నిర్మాతలు, రైటర్, డైరెక్టర్ బాలయ్యతో కలిసి జై బాలయ్య పాటకు కాలు కదపడం హైలెట్.. ఇక గోపిచంద్‌ని ‘క్రాక్’ కి ముందు సంవత్సరంన్నర పాటు స్ట్రగుల్ అయ్యావ్.. ప్రాపర్టీ కూడా అమ్మావని తెలిసింది.. ఏం జరిగింది? అని అడగ్గా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టాడు. పక్కనే ఉన్న వరలక్ష్మీ ఓదార్చే ప్రయత్నం చేసింది. కాగా ప్రోమోలో బాలయ్య కాల్ చేసి వంద కోట్ల హీరోకి కంగ్రాట్స్, సంక్రాంతికి భీమవరంలో కామన్ వెల్త్ గేమ్స్ ఆడతారంటగా అంటూ ఎవరితో మాట్లాడరనే విషయం గురించే ఫ్యాన్స్, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus