బాక్సాఫీస్ వద్ద భారీ సమరానికి సంక్రాంతి రెడీ అయిపోయింది. సంక్రాంతి పండుగకు నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో వస్తుండగా.. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పూర్తి మాస్ ఫ్యాక్షన్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి వేళ జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. గోపిచంద్ మలినేని పీక్స్ లో మాస్ ని మిక్స్ చేసి బాలయ్యను మరోరూపంలో చూపిస్తుండగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమైపోయింది.
కాగా ఫ్యాక్షన్ కథతో తెరకెక్కుతున్న బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ప్రతి క్యారెక్టర్ విషయంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఎంతో జాగ్రత్తవహించాడు. స్క్రీన్ మీద కొత్తదనం కోసం నందమూరి బాలయ్యకు విలన్ గా కన్నడ నటుడిని సెలెక్ట్ చేశారు. కన్నడ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న దునియా విజయ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా అతడు తన తొలి తెలుగు సినిమా గురించి అభిప్రాయాలను పంచుకున్నాడు.
దునియా విజయ్ మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులే నా దేవుళ్లు. వారి ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కు ముందు అమ్మానాన్న ఇద్దరూ చనిపోయారు. ఈ సినిమా చూడకుండానే నా తల్లి మరణించారన్న బాధ ఉంది. దునియా సినిమా మధ్యలో ఆగిపోతే నేను రూ.12లక్షలు ఇచ్చాను. అప్పుడు ఇంట్లో వాళ్లతో గొడవపడి మరీ ముందడుగు వేశాను. చివరికి సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా నా ఇంటి పేరుగా మారిపోయింది’ అని వివరించాడు.
ఇక తెలుగులో అవకాశం రావడం గురించి దునియా విజయ్ మాట్లాడుతూ.. ‘వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ తెలుగులోకి రావడానికి చాలాకాలం పట్టింది. మొదట తెలుగులో లవకుశ సినిమా ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు కన్నడలో బిజీగా ఉండి చేయలేకపోయాను. తర్వాత గోపిచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’ సినిమా గురించి సంప్రాదించాడు. ముసలిముడుగు ప్రతాప్ రెడ్డి రోల్ చేయాలన్నారు. ఆ రోల్ గురించి చెప్పగానే ఓకే చెప్పేశా. ఎప్పుడెప్పుడు పాత్ర చేయాలా అని ఎదురు చూశాను. సినిమా అదిరిపోతుంది’ అని పేర్కొన్నాడు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!