గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ 2004లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా ఆయన పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. దానికి కారణం ఆయన కూతుళ్లే. వీరప్పన్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు విద్యారాణి, రెండో కూతురు విజయలక్ష్మి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరప్పన్ పెద్ద కూతురు విద్యారాణిని బీజేపీ అక్కున చేర్చుకుంది. దేశవ్యాప్తంగా పేరుగాంచిన స్మగ్లర్ కూతురు కావడంతో విద్యారాణి తరచూ వార్తల్లో నిలుస్తుంది.
విద్యారాణి చెల్లెలు విజయలక్ష్మి కూడా తమిళ్వురిమై పార్టీలో చేరారు. అయితే పెద్దగా గుర్తింపు లేని పార్టీ కావడంతో విజయలక్ష్మిని రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీకి నటిగా పరిచయం కానుంది. ‘మావీరన్ పిళ్లై’ అనే సినిమాలో విజయలక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కెఎన్ రాజా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లు విడుదల కావడంతో విజయలక్ష్మి పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తన తండ్రి మాదిరి భుజాన తుపాకీని వేసుకొని నిలబడ్డ విజయలక్ష్మి ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. గతంలో చాలా మంది డబ్బుల కోసం వీరప్పన్ పై సినిమాలను తీసి తమ పరువు, మర్యాదకు ఇబ్బంది కలిగించారని వీరప్పన్ భార్య వి.ముత్తులక్ష్మి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు వీరప్పన్ సొంతకూతురు స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేస్తుండడం హాట్ టాపిక్ అయింది. మరి నటిగా విజయలక్ష్మి ఇండస్ట్రీలో ఎంతవరకు రాణిస్తుందో చూడాలి!
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!