Venaktesh: తన ఫ్యాన్స్ గురించి వెంకీమామ అంత మాట అనేశాడేంటి..!

జూలైలో ‘నారప్ప’ తో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్… ఈసారి ‘దృశ్యం2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతుండడం పట్ల వెంకటేష్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై నిర్మాత మరియు వెంకటేష్ అన్నయ్య అయిన సురేష్ బాబుని తిట్టిపోశారు కూడా..! వెంకటేష్ అభిమానులను పక్కన పెడితే..నాని ‘టక్ జగదీష్’ ఓటిటిలో విడుదల చేస్తున్నారని ప్రకటించిన సమయంలో

‘తెలుగు సినిమా భవిష్యత్తు గురించి, థియేటర్ల గురించి’ ఆందోళన వ్యక్తం చేసిన డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు సురేష్ బాబు, వెంకటేష్ ల విషయంలో అయితే గప్ చుప్ అన్నట్టు కూర్చున్నారు. అవన్నీ పక్కన పెట్టినా.. ‘మీ ‘నారప్ప’ లానే ‘దృశ్యం2′ కూడా ఓటిటిలో విడుదలవుతున్నందుకు మీ అభిమానులు ఫీలవుతున్నారు’ అని వెంకటేష్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘ నా ఫ్యాన్స్ అలాంటివేం ప‌ట్టించుకోరు. వాళ్ళకి నాపై కానీ నా సినిమాల పై కానీ పెద్ద‌గా అంచనాలు ఉండ‌వు.

అందుకే నేను హ్యాపీగా నా వంతు ప్ర‌యోగాలు చేసుకోగలుగుతున్నాను.నా రెండు సినిమాలు ఓటీటీలో రావడం అనేది నేను ప్లాన్ చేసింది ఏమీ కాదు.అలా జరిగింది అంతే..! ఈసారి థియేట‌ర్లో చూడ‌ద‌గ్గ సినిమాతో వస్తాను.’ఎఫ్ 3′ అలాంటి సినిమానే…! హాయిగా థియేట‌ర్ల‌లో చూసుకోవ‌చ్చు. ఓటిటి అయినా, థియేట‌ర్ అయినా మంచి సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందించాలన్నదే నా తాపత్రయం’ అంటూ జవాబిచ్చాడు. వెంకీ మామ కూల్ ను మెచ్చుకోవచ్చు..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus