‘వెంకీమామ’ హిట్ టాక్ పట్ల ఎమోషనల్ అయిన వెంకటేష్..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వెంకటేష్, నాగ చైతన్య ల ‘వెంకీమామ’ చిత్రం ఈరోజు.. అనగా డిసెంబర్ 13న విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను రాబట్టి.. మంచి కలెక్షన్లు రాబట్టే దిశగా ముందుకు సాగుతుంది. వెంకటేష్, నాగ చైతన్యలకు ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజు బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ‘వెంకీమామ’ బ్రేక్ ఈవెన్ సాధించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇక సినిమాకి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. అందులోనూ ఈరోజు తన పుట్టినరోజు కావడంతో వెంకటేష్ భావోద్వేగానికి లోనయ్యాడు.

వెంకటేష్ తన ఇన్‌స్టా ద్వారా స్పందిస్తూ… ఇలాంటి రోజున మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం నాన్నా! (తండ్రి రామానాయుడు గారిని తలుచుకుంటూ). ‘మిస్‌ యూ నాన్న’. ‘వెంకీమామ’ చిత్రం ఇప్పుడు మీ అందరిదీ (ప్రేక్షకులకి). దగ్గరలోని థియేటర్‌కు వెళ్ళి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి’..! అంటూ పోస్ట్ చేసాడు. నిజానికి వెంకటేష్, చైతన్య కాంబినేషన్లో సినిమా రావాలనేది దివంగత రామానాయుడు గారు ఎప్పటినుండో కలలు కనేవారట. ఇంత కాలానికి ఆయన కల నెరవేరినప్పటికీ.. ఈరోజు ఆయన లేరు. అందుకే వెంకటేష్ ఇలా భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus