సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta) అందరికీ సుపరిచితమే. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)- మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో వచ్చిన ‘దిల్ సే’ (Dilse) తో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కూడా ఆమె సినిమాలు చేసింది. వెంకటేష్ (Venkatesh) హీరోగా జయంత్ సి పరాన్జీ (Jayanth C. Paranjee) దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమంటే ఇదేరా’ ( Premante Idera) తో ఆమె డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) డెబ్యూ మూవీ ‘రాజకుమారుడు’ (Rajakumarudu) లో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఈమె కనిపించలేదు.
ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజెన్ ‘మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది..నిజమేనా?’ అంటూ ప్రశ్నించాడు. ప్రీతి జింటా ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ… “అలాంటి వాటిపై నాకు ఇంట్రెస్ట్ లేదు! రాజకీయాలకి నేను చాలా దూరం. కొన్నేళ్ల క్రితమే నాకు పలు రాజకీయ పార్టీల నుండి పిలుపు వచ్చింది.
నాకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశారు. కానీ నాకు వాటిపై ఆసక్తి లేక వద్దన్నాను. నాకు రాజకీయాలు చేయడం అస్సలు తెలీదు” అంటూ జవాబిచ్చిన ఆమె మరిన్ని సామాజిక అంశాలపై కూడా స్పందించింది. ‘ఇండియాలో సోషల్ మీడియా చాలా దారుణంగా తయారయ్యింది.ఇంకా చెప్పాలంటే విషపూరితంగా మారిపోయింది అని చెప్పాలి.
పొలిటికల్ గా నా పై వస్తున్న రూమర్స్ ని నేను ఖండిస్తాను. ఎందుకంటే నేను రాజకీయ నాయకురాలిని కాదు. రాజకీయాలపై నాకు ఆసక్తి ఎంతమాత్రం లేదు. కానీ ఒక సాధారణ మహిళగా నాకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. దానిని మాత్రం నేను ఉపయోగించుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది.